–8లో | - | Sakshi
Sakshi News home page

–8లో

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

–8లో జెడ్పీటీసీ బరిలో 52 మంది

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

● పురవీధుల్లో పూజారి రూపంలో

పైడితల్లి విహారం

● మధ్యాహ్నం 3 గంటలకే

ప్రారంభమైన సిరిమాను తిరువీధి

● అర్నబ్‌ తుఫాన్‌తో తగ్గిన భక్తులతాకిడి

● రాష్ట్ర ప్రభుత్వం తరఫున

పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్‌

● అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

● పైడితల్లికి లక్షపుష్పార్చన

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడున్న దృష్ట్యా పార్టీలకు అతీతంగా పోస్టులు పెట్టడం వంటివి చేయవద్దంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

కొవ్వొత్తుల వెలుగులో..

సంతకవిటి: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. సంతకవిటి మండల పరిషత్‌ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల విత్‌ డ్రా, తుది జాబితా రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సిబ్బంది కొవొత్తుల వెలుగులో పూర్తిచేశారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

పార్వతీపురం: అర్నబ్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ‘భారీ వర్షాలతో పాటు ఈదురు గాలుల వీచే అవకాశం ఉందని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్‌, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాల’ని కలెక్టర్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. జియ్యమ్మవలస, పార్వతీపురం, వీరఘట్టం, గరుగుబిల్లి, పాలకొండ, మక్కువ, సీతానగరం, బలిజిపేట మండలాల్లో బుధవారం 56 కి.మీల నుంచి 48.91 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో జేసీ ఆర్‌.వైశాలి, పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు సచిన్‌ ఆర్చిత్‌ రహర్‌, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్వో కె.హేమలత, డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుల (జెడ్పీటీసీ) ఎన్నికలకు సంబంధించి 52 మంది పోటీ పడుతున్నారు. మంగళవారంతో ఉప సంహరణ గడువు ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని 15 జడ్పీటీసీ స్థానాలకు 127 నామినేషన్లు రాగా.. అందులో తిరస్కరణ, ఉప సంహరణ అనంతరం 52 మంది మిగిలారు. మండలాల వారీగా గరుగుబిల్లి– 2, భామిని–3, పాలకొండ–2, సీతంపేట–2, కురుపాం–6, సీతానగరం–3, పార్వతీపురం–4, సాలూరు–3, గుమ్మలక్ష్మీపురం–7, వీరఘట్టం–5, కొమరాడ–2, బలిజిపేట–4, మక్కువ–4, పాచిపెంట–2, జియ్యమ్మవలస ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నారు. పార్టీల వారీగా చూసుకుంటే.. వైఎస్సార్‌ సీపీ అన్ని స్థానాల్లోనూ(15)పోటీ చేస్తోంది. టీడీపీ 9, స్వతంత్ర 8, జనసేన 5, కాంగ్రెస్‌ 5, బీఎస్పీ 4, రెడ్‌ స్టార్‌ 3, సీపీఎం 2, బీజేపీ 1 చొప్పున ఉన్నాయి. నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనుంది. అదే నెల 5న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మడ్డువలస గేట్లు ఎత్తివేత

● 16వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఐదు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్‌ తెలిపారు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 3వేల క్యూసెక్కుల నీరు ప్రాజె క్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 63.73 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు విడిచి పెడతామని ఏఈ తెలిపారు.

విజయనగరం:

మంగళ వాయిద్యాలు.. భక్తుల భజనలు... జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ జయజయ ధ్వానాల నడుమ విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి సిరిమాను సంబరం మంగళవారం ప్రశాంతంగా సాగింది. సిరిమాను పూజారి రూపంలో దర్శనమిచ్చిన సిరులతల్లికి భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉదయం నుంచి కురిసిన జోరువానలోనే సిరిమాను తిరువీధి సాగింది. జిల్లా యంత్రాంగం ముందుస్తుగా నిర్ణయించిన సమ యం ప్రకారం పూజారి బంటుపల్లి వెంకటరావు మధ్యాహ్నం 2.38 గంటలకు సిరిమానును అధిరోహించగా.. 2.55 గంటలకు సిరిమాను రథం కదిలింది. పాలధార ముందు కదలగా తెల్ల ఏనుగు, బెస్తవారి వల, అంజలి రథం సిరిమాను వెంట సాగాయి. అమ్మవారి చుదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమాను తిరువీధి డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేసింది. అనంతరం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది.

● పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్‌

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ ఎం.రాంసుందర్‌రెడ్డి సతీసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూజాక్రతువులు పూర్తిచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించి పట్టువస్త్రాలు సమర్పించారు. శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

● సిరిమానోత్సవంలో ప్రముఖులు

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సుధాగజపతి, ఊర్మిళా గజపతి, ఇతర రాజకుటుంబీకులు ఎప్పటిలాగే కోట బురుజుపై నుంచి తిలకించారు. వీరితో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, తదితరులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు. రాష్ట్ర శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి తమ కుటుంబంతో కలిసి పాత అర్బన్‌ బ్యాంక్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఉత్సవాన్ని తిలకించారు. వాస్తవానికి వీరంతా ప్రతి ఏడాది అమ్మవారి ప్రతిరూపంగా భావించే సిరిమాను ఉత్సవం ప్రారంభం నుంచి పూర్తియ్యేంత వరకు వేచి ఉండగా.. ఈ ఏడాది భారీ వర్షం... ఈదురుగాలుల నేపధ్యంలో మొదటి సారి సిరిమాను తిరిగి వచ్చే సరికి ఆయా వేదికల నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఉత్సవంలో ముందు ఉండే సన్నాయి మేళం కూడా ఈ ఏడాది వర్షం కారణంగా ఏర్పాటు చేయలేదని అధికారులు చెబుతున్నారు.

● ఇళ్లకే పరిమితమైన భక్తులు

ఏటా అంగరంగ వైభవంగా, లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల నడుమ సాగే పైడితల్లి సిరిమాను సంబరం అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా సందడి తగ్గింది. ఎడతెరిపిలేని వర్షంతో భక్తులు ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తుల రాక తగ్గింది. సిరిమానోత్సవం రోజు కిక్కిరిసేలా కనించే వీధులు సందడిలేకుండా పోయాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భక్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ధైర్యం చేయలేదు.

విపక్షనేతపై ఎందుకా వివక్ష..?

ఉదయం రాజకీయ ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అందరినీ నేరుగా పంపించిన ఆలయ అధికారులు, పోలీస్‌ సిబ్బంది శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణకు దర్శనం కల్పించడంలో కూడా వివక్ష చూపారు. దర్శనానికి వచ్చిన ఆయనను సుమారు పదినిమిషాల పాటు నీరక్షింపజేసిన అనంతరం బారికేడ్లు ఓపెన్‌ చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు పంపించారు.

సిరులతల్లి సిరిమాను జాతర ఓ వైపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో చదురుగుడిలో పైడితల్లికి వేదపండితులు లక్షపుష్పార్చన సేవను నిర్వహించారు. ఆలయమంతా వేదమంత్రోచ్ఛారణతో మార్మోగింది. జై పైడిమాంబ జైజై పైడిమాంబ నినాదాలతో భక్తజనం లక్ష పుష్పార్చన సేవలో తరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement