● పార్వతీపురం 24వ వార్డులో వైఎస్సార్సీపీ ముమ్మర ప్రచారం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పురపాలక సంఘం ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. పట్టణంలోని బెలగాం 24వ వార్డులో ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు గడపగడపకూ వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి పట్నాన సాయిశ్రీ, 24వ వార్డు అభ్యర్థి జమ్ము దుర్గారాణిలతో కలిసి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఓటర్ల చెంతకు వెళ్లారు.
వార్డులోని ప్రతి వీధిని చుట్టివస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు బ్యాలెట్ పత్రంపై అవగాహన కల్పిస్తూ..మొదటి స్థానంలో (1వ నంబర్) ఉన్న చైర్‌పర్సన్ అభ్యర్థి సాయిశ్రీకి, అలాగే రెండో స్థానంలో (2వ నంబర్) ఉన్న వార్డు అభ్యర్థి దుర్గారాణికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టిడ్కో మాజీ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండలో జోరుగా వైఎస్సార్‌సీపీ ప్రచారం


