జన నీరాజనం | - | Sakshi
Sakshi News home page

జన నీరాజనం

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

సాలూరు రూరల్‌: సాలూరు మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి భవిరెడ్డి రిబ్కారాణికి జనం నీరాజనం పడుతున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరతో కలిసి ఆమె చేస్తున్న వార్డుల పర్యటనలో ప్రజలు పూలమాలలు హారతులతో అడుగడుగునా స్వాగతిస్తున్నారు. సంక్షేమానికి మారుపేరు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ ప్రజల ఆదరణ చూరగొంటున్న రాజన్నదొర ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు వివిధ వార్డుల్లో ప్రజలను ఇంటింటికీ వెళ్లి పలకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 1,7,8,9 వార్డుల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. రాజన్నదొర రాకను ముందుగానే తెలుసుకున్న ప్రజలు హారతులతో స్వాగతం పలికేందుకు పోటీ పడ్డ తీరు మంచినాయకుడికి ఇచ్చిన ఘనమైన స్వాగతంగా స్థానికులు ప్రస్తావించడం రాజన్నదొర మచ్చలేని పాలనకు నిదర్శనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement