విజయనగరం: జాతీయస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారిణి సత్తా చాటింది. జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్‌లో ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన కె. సాహిత్య కాంస్య పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కాంస్య పతకం సాధించిన సాహిత్యను స్కూల్ గేమ్స్ కార్యదర్శి వాణిశ్రీ, శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వేణుగోపాలరావు అభినందిం చారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి విజయనగరం జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహిస్తూ సాహిత్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.
45 మద్యం సీసాలు స్వాధీనం
పాలకొండ: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో శనివారం అర్ధరాత్రి తనిఖీల్లో భాగంగా 45 మద్యం సీసాలను టాస్క్‌ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు. కె సూరిబాబు అనే వ్యక్తి మద్యం డంప్ చేసినట్లు గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. రెవెన్యూ, పోలీసు, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది కలిసి పెట్రోలింగ్ నిర్వహించిన సమయంలో ఈ విషయం గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేశామని ఆమె తెలిపారు.
ఆలయంలో చోరీ ఘటనపై వీహెచ్‌పీ ఆరా
విజయనగరం క్రైమ్: అరుంధతి నగర్ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన చోరీప్రదేశాన్ని విశ్వహిందూ పరిషత్ జిల్లా నేతలు ఆదివారం సందర్శించారు. ఆలయంలో స్వామివారికి సంబంధించిన ఏయే ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అనే విషయాలపై ఆలయ నిర్వాహకులు, అర్చకులను అడిగి వివరాలు తెలుసుకుంచారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వహిందూ పరిషత్ నాయకులు అడిగి తెలుసుకుని, ఆలయ భద్రతకు సంబంధించి తగిన సూచనలు, సలహాలు అందించారు.దేవాలయాల్లో ఇటువంటి చోరీ ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, దొంగిలించిన స్వామివారి ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొండా కాశీ, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కాళ్ల నాగభూషణ్ విశ్వహిందూ పరిషత్ లీగల్ సెల్ న్యాయవాది అనూష విశ్వహిందూ పరిషత్ విజయనగరం నగర కార్యదర్శి కంచి చినబాబు తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
సీతానగరం: మండలంలోని ప్రధాన రహదారిపై కాశీపేట–అంటిపేట గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. అంటిపేట, కాశీపేట చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నాళ్లుగా యాచన చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం చెట్టు కింద విగత జీవిగా ఉన్నట్లు గుర్తించిన కొంతమంది స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ఎం.హేమలత ఆధ్వర్యంలో హెచ్‌సీ తిరుపతిరావు, అప్పలకొండ సంఘటనా స్థలానికి చేరకుని మృతదేహానికి దహనక్రియలు చేసినట్లు ఎస్సై ఎం.హేమలత తెలియజేశారు.


