తుఫాన్‌పై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌పై అప్రమత్తం

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

తుఫాన్‌పై అప్రమత్తం

పార్వతీపురం: భారీ వర్షాలు, తుఫాన్‌ నేపధ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి సూచించారు. తుఫాన్‌ ప్రభా వంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలి పారు. తెగిపడిన విద్యుత్‌ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపానికి వెళ్లరాదని, ఉధృతంగా ప్రవహించే వాగులు, గెడ్డలు, వంతెనలు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడల వద్ద ఉండరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు, అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. తాగునీరు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, టార్చ్‌లైట్లు, ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ముందస్తుగా వైద్యసహయం పొందాలని తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం సంప్రదించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

● కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement