పార్వతీపురం రూరల్: ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధి కారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు పత్రాల సమర్పణలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. వారి సందేహాలను తక్షణమే నివృత్తి చేసేందుకు వీలుగా కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సంబంధిత మండల స్థాయి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


