పార్వతీపురం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు జిల్లా పోలీస్ యంత్రాంగం మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సి.ఆర్.పి.సి) నిబంధనలు అమలులో ఉన్నాయని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుమిగూడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం నిషేధమన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జెడ్పీ కార్యాలయంలోని జెడ్పీటీసీ నామినేషన్ దాఖలు కేంద్రాన్ని అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ సీహెచ్.వి.శేషయ్య గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


