సూరప్ప చెరువులో గజరాజులు | - | Sakshi
Sakshi News home page

సూరప్ప చెరువులో గజరాజులు

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

సూరప్ప చెరువులో గజరాజులు తోటపల్లి హుండీల ఆదాయం రూ.8.16 లక్షలు ఆస్పత్రులు, ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి ● డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి

సీతానగరం: మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న గజరాజులు గురువారం గుచ్చిమి గ్రామంలోని సూరప్ప చెరువులో జలకాలాడుతున్నాయి. పదిరోజులుగా వివిధ గ్రామాల్లో సంచరిస్తున్న గజరాజులు పగటి పూట చెరువులు, తోటల్లో నివసిస్తున్నాయని స్థానికులు తెలి యజేశారు. బీటీరోడ్లపై గజరాజులు సంచరి స్తున్న కారణంగా బందలుప్పి, పులిగుమ్మి రేపటివలస, చిన్నారాయుడుపేట, సీతారాంపురం గుచ్చిమి గ్రామాలకు రాకపోకలు చేస్తున్న వారు జాగ్రత్తలు పాటించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.

గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు హుండీలలో వేసిన కానుకల ద్వారా రూ.8,16,158ల నగదు ఆదా యంగా వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణా ధికారి వీవీ.సూర్యనారాయణ గురువారం తెలి పారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం హుండీ నుంచి రూ.8,12,489లు, 25.600 గ్రాముల బంగారం, 3.100 కిలోల వెండి వచ్చింది. అలాగే శ్రీకోదండ రామాలయం హుండీ నుంచి రూ.3,669లు నగదు వచ్చిందన్నారు. గురువారం నిర్వహించిన హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని పాలకొండ శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ఈఓ కె.పరమేశ్వరి పర్యవేక్షణ లో ఈఏడాది జూలై 10నుంచి అక్టోబర్‌ 22వ తేదీవరకు సంబంధించిన ఆలయాల హుండీలలో భక్తులు స్వామివారికి వేసిన మొక్కులు, ముడుపులను లెక్కించినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో శ్రీస్వామివారి సేవకులు, సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: జిల్లా పరిధిలోని పట్టణ, ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, స్కానింగ్‌, ఫెర్టిలిటీ, ఫిజియోథెరపీ, డెంటల్‌ తదితర వైద్య కేంద్రాలు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–2002 ప్రకారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.విజయలక్ష్మి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె హెచ్చరించారు. రిజిస్ట్రేషన్‌ కోసం హెచ్‌టీటీపీఎస్‌://క్లినికల్‌ ఎస్ట్‌ యాక్ట్‌.ఏపీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రత్యేకంగా హెచ్‌టీటీపీఎస్‌://పీసీపీఎన్‌డీటీ.ఏపీ.గవ్‌.ఇన్‌ పోర్టల్‌లో తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement