● ఎన్నికల వేళ..గత వాగ్దానాలపై ప్రశ్నించండి ● పట్టణాల్లో సమస్యలు కోకొల్లలు
టూ పోతే.. ప్రతి ప్రాంతంలో రక్షిత నీటి సమస్య ఉంది.
●పట్టణానికి సంబంధించి శాశ్వత డంపింగ్‌యార్డు లేదు. దీనిపై కూటమి నాయకులు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు.
●అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడక పోవడంతో చిన్నపాటి వర్షాలకు కస్పా వీధి, గురువుగారి వీధి, నీలమ్మకాలనీలో కొంతభాగం, కోమటిపేట తదితర ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
●శివారు ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్వహణకు నోచుకోకపోగా..నూతన నిర్మాణాలు చేపట్టకపోవడంతో మహిళల ఆత్మగౌరవానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/ సాలూరు రూరల్/పాలకొండ రూరల్: పల్లె నుంచి పట్టణం వరకూ మహిళా ఓటర్లే అధికం. ప్రస్తుతం ఎన్నికల కాలం నడుస్తోంది. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేంది మహిళా మణులే. ఓట్ల కోసం ఇంటి గడప వద్దకు నాయకులు వచ్చినప్పుడు వాటిపై ప్రశ్నించే అవకాశం సీ్త్ర మూర్తులకు దక్కేది ఈ సమయంలోనే..
పాలకొండ నగర పంచాయతీలో దీర్ఘకాలిక సమస్యలు తిష్ఠ వేశాయి. దీంతో మహిళలు అవస్థలు పడుతున్నారు. 42వేల పై చిలుకు జనాభా ఉన్న పట్టణంలో 23,466 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళా ఓటర్లు 12,012మంది. పట్టణంలో ఏ వార్డులో చూసినా తాగునీటి సమస్య వేధిస్తోంది. మహిళలు బిందెడు నీటికోసం నానా అవస్థలు పడుతున్నారు. గారమ్మ, నీలమ్మ, జగనన్న కాలనీ ఇలా చెప్పుకుం
తుప్పలతో నిండిన ఆటో నగర్ స్థలం
సాలూరు పురపాలక సంఘం పరిధిలో మొత్తం ఓటర్లు 41,934 మంది కాగా.. వారిలో మహిళల సంఖ్య 21,893. స్థానిక శాసన సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మంత్రి అయిన తరువాత మొదటిసారిగా పట్టణంలో పర్యటించినప్పుడు మహిళల ఆత్మగౌరవానికి సామూహిక మరుగుదొడ్లు అవసరమని, వారం రోజుల్లో పట్టణంలో పాడైపోయిన అన్ని సామూహిక మరుగుదొడ్లనూ రూ.20 లక్షలు వెచ్చించి బాగు చేయిస్తామని చెప్పుకొచ్చారు. దాదాపు రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా.. ఆ పనులను చేపట్టలేకపోయారు.
సాలూరులో వైఎస్సార్ కూడలి నుంచి వేద సమాజం దిగువ వరకు తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి సుమారు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ పనులు జరగలేదు.
గత ఎన్నికల సమయంలో జీగిరాం జూట్ ఫ్యాక్టరీని గెలిచిన వెంటనే తెరిపిస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వంద పడకల ఆస్పత్రిని 85శాతం పూర్తి చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లు పూర్తయ్యాక మిగులు 15 శా తం పనులు పూర్తి చేశారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకుండానే ప్రారంభోత్సవం చేయడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. దీంతో దాతలు కొంతమంది సహకారం అందిస్తున్నారు.
లారీ పరిశ్రమపై ఆధారపడిన పట్టణ ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని ఎన్నికల వేళ భరోసా ఇచ్చి, ఆటో నగర్ నిర్మాణాన్ని కూడా చేపట్టకుండా విడిచిపెట్టారు.
పట్టణంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. పట్టణంలో వస్తున్న మురుగునీరు అంతా వేగావతి నదిలో కలవడంతో నీరు కలుషితమవుతోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో తాగునీటి అవసరాల కోసం మంజూరు చేసిన పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.
గతంలో ఉన్న రైలు బస్సును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి మాటలు నేటికీ అమలు కాలేదు.
పట్టణంలో చెరువులు, కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై పట్టించుకున్న దాఖలాలు లేవు.


