ప్రాదేశిక కోలాహలం | - | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక కోలాహలం

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

ప్రాదేశిక కోలాహలం ● జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల తాకిడి ● కూటమి వర్గాల్లో కుదరని సయోధ్య

చిన విషయం విదితమే. పార్వతీపురం జెడ్పీటీసీ స్థానం ఇస్తామన్న హామీ మేరకు చివరి రోజు మున్సిపల్‌ బరిలో తమ నామినేషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. తీరా.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పార్వతీపురం జెడ్పీటీసీ స్థానం విషయంలోనూ ఎమ్మెల్యే విజయ్‌చంద్ర గట్టి ఝులక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్థానానికి ఎమ్మెల్యే సతీమణి స్వయంగా బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. చివరి రోజున మరింత ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల కోలాహలం రెండో రోజు రెట్టింపయ్యింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 38 నామినేషన్లు రాగా.. ఇందులో వైఎస్సార్‌సీపీ 18, టీడీపీ 11, జనసేన 3, ఇండిపెండెంట్‌ 2, సీపీఎం రెడ్‌స్టార్‌ 2, కాంగ్రెస్‌ 1, బీఎస్పీ 1 చొప్పున ఉన్నాయి. వీరంతా జెడ్పీ కార్యాలయం వద్ద తమ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గంలోని తమ అభ్యర్థులతో దగ్గరుండి నామినేషన్‌ పత్రాలు వేయించారు.

● జిల్లాలోని మొత్తం 226 ఎంపీటీసీ స్థానాలకు రెండోరోజు 576 నామినేషన్లు దాఖలయ్యాయి.

కూటమిలో రె‘బెల్స్‌’ బెడద

జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానానికి టీడీపీలో పోటీ ఏర్పడింది. కురుపాం మండలం నుంచి టీడీపీ తరఫున జెడ్పీటీసీగా ట్రైకార్‌ బోర్డు డైరెక్టర్‌ పువ్వల లావణ్య నామినేషన్‌ వేశారు. ఆమె కూడా చైర్‌పర్సన్‌ పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు జెడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్న టీడీపీకి చెందిన వీరేష్‌చంద్రదేవ్‌ కూడా కురుపాం మండలం నుంచే జెడ్పీటీసీగా శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు.

పార్వతీపురం పురపాలక సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఆశించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు.. తన సతీమణితో నామినేషన్‌ వేయిం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement