ఎస్‌ఎంసీ చైర్మన్‌లకు రాజన్నదొర అభినందనలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ చైర్మన్‌లకు రాజన్నదొర అభినందనలు

Sep 30 2026 12:58 AM | Updated on Sep 30 2026 12:58 AM

జాతీయ తైక్వాండో పోటీల రిఫరీగా విక్రమ్‌ యశ్మిత

పాచిపెంట: మండలంలో జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్‌లు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి సాలూరు పట్టణంలో రాజన్నదొర ఇంటికి చేరుకున్నారు. గెలిచిన వారిని రాజన్నదొర సన్మానించి, అభినందనలు తెలిపారు.

విజయనగరం: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో జరగనున్న సబ్‌–జూనియర్‌, జూనియర్‌ జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరానికి చెందిన క్రీడాకారిణి విక్రమ్‌ యశ్మిత రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎఫ్‌ఐ) నుంచి ఆమెకు అధికారిక ఉత్తర్వులు అందాయి. అక్టోబర్‌ 2 నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ జాతీయస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి హాజరయ్యే క్రీడాకారుల మ్యాచ్‌లకు యశ్మిత రిఫరీగా విధులు నిర్వహించనున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణికి అరుదైన గౌరవం దక్కడం పట్ల స్థానిక క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ వేణుగోపాలరావు, విజయనగరం జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు యశ్మితను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో రిఫరీగా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

పాచిపెంటలో 4 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా

పాచిపెంట: మండలంలోని 121 పాఠశాలలకు గాను 117 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగగా కోరం లేక నాలుగు పాఠశాలల్లో వాయిదాపడినట్లు ఎంఈఓ సతీష్‌ తెలిపారు.

బాగువలసలో..టీడీపీ నాయకుల గలాటా

సాలూరు: మండలంలోని పెదపదం పంచాయతీ బాగువలస జెడ్పిహెచ్‌ పాఠశాలలో జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికలను అధికార టీడీపీ నేతలు రచ్చ చేశారు. తమ అధికార బలాన్ని ప్రదర్శించి చైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను వాయిదావేసే పరిస్థితిని సృష్టించారు. టీడీపీ నాయకుడు మత్స శ్యామ్‌, అనుచరులు పాఠశాలకు వచ్చి హెచ్‌ఎం, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నచ్చిన విధంగా ఎన్నిక నిర్వహించారని, ఇది ఎన్నిక కాదని, బహిష్కరించామని దీనిపై కలెక్టర్‌,డీఈఓకు ఫిర్యాదుచేస్తామంటూ హెచ్‌ఎంతో వాగ్వాదానికి దిగారు. ఈ భయానక వాతావరణ నేపథ్యంలో చాలాసేపు వేచి ఉన్న సభ్యులు ఇంటి ముఖం పట్టారు. కాగా చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించేందుకు సభ్యులు పాఠశాల కాంపౌండ్‌లో లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేసినట్లు హెచ్‌ఎం వెంకటరావు తెలిపారు.

సారికలో సోషల్‌ ఆడిట్‌

సాలూరు: మండలంలోని సారిక పంచాయతీలో ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు చేపట్టిన పనులపై ఉపాధిహామీ సోషల్‌ ఆడిట్‌ మంగళవారం నిర్వహించారు. పింఛన్లు, ఐటీడీఏ, ఉపాధిహామీద్వారా చేపట్టిన పనులపై సోషల్‌ ఆడిట్‌ను డిస్ట్రిక్ట్‌ రిసోర్స్‌ పర్సన్‌ రవి ఆధ్వర్యంలో సారిక సచివాలయం వద్ద నిర్వహించారు. ఈ సచివాలయం పరిధిలో సుమారు రూ.కోటి 80లక్షలకు పైగా నిధులకు సంబందించి ఉపాధిహామీ ద్వారా 114 పనులు, ఐటీడీఏ ద్వారా 7 పనులు జరిగాయని వాటిపై ఆడిట్‌ చేశామని ఆయన తెలిపారు. 487 జాబ్‌కార్డులుండగా, 50 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనులు చూపించారని, చేసిన పనుల కొలతల్లో తేడాలు,మస్టర్లలో దిద్దుబాట్లు ఉన్నాయని, వివిధ చెరువుల్లో కొబ్బరిమొక్కలు నాటినట్లు ఫొటోలు చూపినా సంరక్షణ లేక చెరువుల్లో ప్రస్తుతం ఆ మొక్కలు లేవని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సారాతో పట్టుబడిన

మహిళపై కేసు నమోదు

వీరఘట్టం: మండలం కేంద్రంలో సారా అమ్మకాలపై మంగళవారం దాడులు చేస్తుండగా స్థానిక నక్కలవీధికి చెందిన ఎం.భవాని అనే మహిళ నుంచి 8 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పాలకొండ ఎకై ్సజ్‌ సీఐ బి.వెంకటరాజు తెలిపారు.అలాగే పాత కేసులో సుశీల అనే మహిళను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement