సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Sep 30 2026 12:58 AM | Updated on Sep 30 2026 12:58 AM

● రాష్ట్ర కంటింజెంట్‌ వర్కర్ల సంఘం

అధ్యక్షుడు దుర్గారావు

విజయనగరం ఫోర్ట్‌: కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఆప్కాస్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర కంటింజెంట్‌ వర్కర్ల సంఘం అధ్యక్షుడు పి.దుర్గారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆక్టోబర్‌ 2 న విశాఖపట్నంలో నిర్వహించే సత్యాగ్రహదీక్షకు సంబంధించిన పోస్టర్స్‌ను స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 కంటే ముందు చేరిన వారి అందరిని రెగ్యులర్‌ చేయాలని, 2014 తర్వాత జాయిన్‌ వారిని 3 లేదా 5 ఏళ్లు సర్వీస్‌ పూర్తి అయిన తర్వాత రెగ్యులర్‌ చేసే విధానాన్ని ప్రకటించాలన్నారు. పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రమాదబీమా, ఆరోగ్య బీమా, కారుణ్య నియామకాలు వర్తింప జేయాలని కోరారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, సమగ్ర శిక్ష తదితర పథకాల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

వ్యాయామంతోనే ఆరోగ్యం

విజయనగరం టౌన్‌: ఒత్తిడిలేని జీవితం, మితాహారం, శారీరక వ్యాయామంతోనే గుండెజబ్బులు దూరమవుతాయని, సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ పేర్కొన్నారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా మంగళవారం కోట జంక్షన్‌ నుంచి తిరుమల మెడికవ ర్‌ ఆస్పత్రి వరకూ 2కె హ్యాకథాన్‌ నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ముందుగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. దారిపొడవునా ర్యాలీలో పాల్గొన్న యు వతతో మమేకమై గంజాయి, మత్తుపదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరా రు. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబ స భ్యులు కూడా ఆనందంగా ఉంటారన్నారు. ఆ రోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయాయమంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, అటువంటి జీవనవిధానాన్ని ప్రతి ఒక్కరూ అలవా టుగా మార్చుకోవాలని యువతను ఎస్పీ కోరా రు. ర్యాలీలో తిరుమల మెడికవర్‌ ఎం.డి డాక్ట ర్‌ కె.తిరుమల ప్రసాద్‌, మాన్సాస్‌ కరస్పాండెంట్‌ కేవీఎల్‌పీ.రాజు, పలు ఆసుపత్రుల వైద్యులు, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement