గృహ గణన చేశారు..
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ:
జనగణన 2027లో భాగంగా గృహగణన కార్యక్రమం మే 1 నుంచి 30వ తేదీ వరకు జరిగింది. జిల్లాలోని రూరల్, పట్టణ ప్రాంతాల్లో నెల రోజుల పాటు వందలాది మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు గృహగణన ప్రక్రియ నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ గౌరవ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో గణన విధులను సిబ్బందితో గౌరవంగా చేయించుకున్న అధికారులు.. వారికి గౌరవంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నేటికీ ఇవ్వలే దు. గృహగణన ప్రక్రియ ముగిసి సుమారు రెండు నెలలు అవుతున్నా ఎన్యూమరేటర్లకు, సూపర్ వైజర్లకు గౌరవ వేతనం అందించలేదు.
ఎందుకు జాప్యం?
జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,136 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లు ఉండగా.. మొత్తం 3,45,608 గృహాలకు గానూ, 10,38,857 జనాభా వివరాలను సేకరించా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఒకొ క్కరికీ రూ.9 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. జనగణన కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ ఉత్తర్వులను గత మే నెలలోనే ప్రభుత్వం జారీ చేసింది. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణ న ప్రక్రియ పూర్తయితే వెంటనే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు గౌరవ వేతనం చెల్లించాలని పేర్కొంది. నేటికీ ఆ మొత్తం మాత్రం ఇంకా జిల్లా అధికారుల నుంచి వెళ్లలేదు.


