ఉత్తరాంధ్ర ట్రావెల్‌హబ్‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు
పూసపాటిరేగ: భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ట్రావెల్‌హబ్‌గా ఎయిర్‌పోర్టు సేవలందించనుంది. మరో నాలుగు నెలల వ్యవధిలో విమానాశ్రయం ప్రారంభానికి అడుగులు పడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చకచకా పూర్తిచేయించింది. ఈ ఏడాది జూలై లేదా ఆగష్టు నెల నాటికి భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు విశాఖపట్టణంలో ఉన్న విమానాశ్రయాన్ని డిఫెన్స్ అవసరాలకే పరిమితి చేయనున్నట్టు సమాచారం. భోగాపురం ఎయిర్ పోర్టును తొలుత కార్గో సేవలకు వినియోగించాలని ప్రతిపాదించినా, నగరాలు పూర్తిస్థాయిలో విస్తరించడం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎయిర్‌పోర్టు కేంద్రం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. ఏటా ఆరు మిలియన్లు మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టు ద్వారా రాకపోకలు సాగిస్తారని అంచనా. అందుకు అనుగుణంగా ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్‌హెచ్–16కు రోడ్లు అనుసంధానం చేస్తూ పలుచోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏ జిల్లా నుంచి అయినా ఎయిర్‌పోర్టుకు గంట వ్యవధిలోపు చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. పనులను కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు భోగాపురం గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు త్వరలో ట్రావెల్‌హబ్‌గా తయారుకానుంది.
ఇక్కడ నుంచి ప్రయాణానికి ప్రత్యేక విమాన సర్వీసులు
విమానాశ్రయానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శంకుస్థాపన
జోరుగా సాగిన పనులు
ఈ ఏడాది జూలై/ఆగస్టులో
అందుబాటులోకి..
విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు డిఫెన్స్
అవసరాలకే పరిమితం


