అట్రాసిటీ బాధితులకు అండగా సీవీఎంసీ | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ బాధితులకు అండగా సీవీఎంసీ

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

అట్రాసిటీ బాధితులకు అండగా సీవీఎంసీ

విజయనగరం టౌన్‌:

ళితులు, గిరిజనులకు సిటిజన్స్‌ అండ్‌ మానటిరింగ్‌ కమిటీ (సీవీఎంసీ) అండగా ఉంటుందని దళిత బహుజన శ్రామిక యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు అన్నారు. శనివారం స్థానిక డీబీఎస్‌యూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అట్రాసిటీ సెక్షన్‌ 15ఎ ప్రకారం బాధితులు, సాక్ష్యుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థ పనిచేస్తుందని చెప్పారు. బాధితులకు న్యాయపరమైన సహాయ, సహకారాలందించడం, పరిహారం అందేలా కృషిచేయడం, చట్టపరమైన హక్కులు అందించి కోర్టులో కేసు ప్రాధాన్యతను వివరిస్తామన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా ఎంపీ రాజు, కో కన్వీనర్‌గా కోట జగదీశ్వరరావు, జామి కృష్ణ, న్యాయ సలహాదారునిగా ఆర్జి కనకదుర్గతో పాటు వివిధ సంఘాలకు చెందిన సభ్యులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement