అదనపు ఎస్పీగా వెంకటేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

అదనపు ఎస్పీగా వెంకటేశ్వరరావు

Mar 12 2026 7:17 AM | Updated on Mar 12 2026 7:17 AM

పార్వతీపురం రూరల్‌: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా ఎం.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ తాత్కాలిక అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను పూర్తిస్థాయిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.

ఏనుగుల బెడద

వీడెదెన్నడో..?

గరుగుబిల్లి: గత ఐదు రోజులుగా మండలంలోని గిజబ, నందివానివలస, తోటపల్లి గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగులు బుధవారం తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామ పరిసరాల్లో సంచరించాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తామర చెరువులో జలకాలాడాయి. ఏనుగుల సంచారంతో రోడ్డుపై రాకపోకలకు ప్రజలు భయపడుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు సాహసించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంత ప్రజలకు ఏనుగుల బెడద ఎన్నడు వీడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement