సాలూరు: వైద్యసేవలు అందించడంలో సాలూరు ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గిరిజన సంఘాల నాయకులు జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల తీరుపై ఆరా తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్పత్రిలోనే సినీగీతాలకు వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన అంశంపై పలువురిని ప్రశ్నించారు. నివేదికను కలెక్టర్, జేసీలకు అందిస్తానని తెలిపారు.
మిమ్స్ విద్యార్థుల ప్రతిభ
నెల్లిమర్ల: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వ ర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్ మీట్‌లో నెల్లిమర్ల మిమ్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వ హించిన క్రీడా పోటీల్లో పతకాలు సాధించారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పల్లా ప్రమీల 100, 200 మీటర్ల పరుగులో మొదటిస్థానం.. లాంగ్‌జంప్‌లో రెండో స్థానం సాధించింది. ఫైనల్ ఇయ ర్ విద్యార్థి అద్యాస సమంత్‌రాయ్ డిస్క్‌త్రోలో మొదటి స్థానం.. జావెలిన్‌త్రోలో రెండో స్థానం సాధించినట్లు పీడీ కళా వెంకటరావు తెలిపారు.


