గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
జామి: మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన యువకుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు, స్ధానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన పాండ్రంకి వెంకటేష్(35) మంగళవారం సాయంత్రం అత్తవారికి సంబంధించి విజయనగరంలోని జూట్‌మిల్లు వద్ద గల పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ వారికి సహాయం చేసి తిరిగి మంగళవారం రాత్రి స్వగ్రామానికి 11.45గంటలకు బైక్‌పై వస్తున్న సమయంలో చిన్నాపురం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో స్పృహ కోల్పోయి పక్కకు పడిపోయాడు. ఈ విషయాన్ని స్ధానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పద్మనాభం మండలం పోలీసులు కేసు నమోదుచేశారు. భీమిలి సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహన్ని స్వగామం కొత్త భీమసింగికి తరలించారు.
పావుగంటముందే భార్యకు పోన్
మృత్యువాత పడడానికి పావుగంట ముందే వెంకటేష్ భార్యకు ఫోన్ చేశాడు. ఇంతలోనే భర్త మృతిచెందాడన్న విషయం తెలియడంతో భార్యతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు వెంకటేష్‌కు భార్య సూర్యకళ ఇద్దరు కుమార్తెలు గాయత్రి(11),యోగితాశ్రీ(10), తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. తండ్రి నాగరాజు ఇటీవల పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు.


