ఎస్సీ, ఎస్టీలకు గుండె గుబిల్లు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు కొండగొర్రి లక్ష్మణ్. కొమరాడ మండలం నయ పంచాయతీ గుడ్డాం గిరిజన గ్రామం. దాదాపు ఎనిమిదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ రాయితీ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్నాడు. ఇటీవల వినియోగ బిల్లు బకాయి అంటూ రూ.6,282 చెల్లించాలని విద్యుత్ శాఖాధికారులు నోటీసు పంపారు. తనకు ఉన్నది ఒక ఫ్యాను, లైటు మాత్రమేనని.. ఎంత వినియోగించినా వంద యూనిట్లు దాటదని.. ఇంత మొత్తం బకాయి ఉంటే తాను ఎలా చెల్లించగలనని లక్ష్మణ్ వాపోతున్నాడు.
ఎస్సీ, ఎస్టీలకు గుండె గుబిల్లు


