ఉత్సవాలకు స్వయంభూ వినాయకుడు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలకు స్వయంభూ వినాయకుడు సిద్ధం

Aug 27 2025 10:05 AM | Updated on Aug 27 2025 10:05 AM

ఉత్సవాలకు స్వయంభూ వినాయకుడు సిద్ధం

ఉత్సవాలకు స్వయంభూ వినాయకుడు సిద్ధం

ఈ ఏడాది ఐదురోజుల పాటు ఉత్సవాలు

భూమిలో పుట్టిన ‘మంతిన’

శిలావినాయకుడిది ప్రత్యేకత

రాజాం/సంతకవిటి: వినాయక చవితి అనగానే మంటపాలు వేయడం, ప్రతిమలు తీసుకురావడం నిమజ్జనం చేయడం షరామామూలే. సంతకవిటి మండలంలోని మంతిన గ్రామంలో నారాయణపురం కుడి కాలువ పక్కనే ప్రతిష్టించిన వినాయకుడికి ఈ చవితి పండగలో విశిష్టత ఉంటుంది. ఇక్కడ వినాయకుడికి గుడి కూడా ఉంది. 1960లో నారాయణపురం కుడికాలువ తవ్వుతున్న సమయంలో భూమిలోంచి రాతి(శిల) వినాయకుడి ప్రతిమ గ్రామస్తులకు లభించింది. అప్పట్లో ఈ ప్రతిమను కాలువ పక్కనే ఓ రావిచెట్టు వద్ద గ్రామస్తులు ప్రతిష్టించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఇక్కడ వినాయకచవితికి గ్రామస్తులు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఐదు రోజుల నుంచి తొమ్మిదిరోజులు పాటు ప్రత్యేక పూజలు, దర్శన కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఏడాది ఎప్పటిలాగానే ఐదురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీ సర్పంచ్‌ ఈశ్వరరావు తెలిపారు.

నాలుగు అడుగుల భారీ విగ్రహం

అప్పట్లో ఇక్కడ ప్రతిష్టించిన వినాయకుడి ప్రతిమ ప్రస్తుతం పెరిగిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది ఈ విగ్రహ పరిమాణంలో మార్పు ఉంటుందని తెలిపారు. భారీ కాయం, బొజ్జతో ఇక్కడి రాతి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. నాలుగు అడుగుల ఈ శిలా విగ్రహాన్ని ఒక్క ఇంచ్‌ కూడా కదపలేదు. ఇక్కడ ఉత్సవాల సమయంలో మట్టి వినాయకుడి ప్రతిమ తెచ్చి పూజలు చేసి, అనుపు పండగ నిర్వహిస్తారు. మంతిన గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తమ ఇళ్లలో ఏ శుభకార్యక్రమం జరిగినా ముందుగా ఇక్కడే పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement