మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్‌ వివరాల నమోదు | - | Sakshi
Sakshi News home page

మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్‌ వివరాల నమోదు

Aug 25 2025 8:26 AM | Updated on Aug 25 2025 8:26 AM

మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్‌ వివరాల నమోదు

మీకోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్‌ వివరాల నమోదు

● కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ● యూరియా కోసం బారులు తీరిన రైతులు ● 7,600 లీటర్ల బెల్లం ఊట.. ● 150 లీటర్ల సారా ధ్వంసం వినాయక విగ్రహాల తయారీపై వర్క్‌షాపులు

● కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం రూరల్‌: మీకోసం వెబ్‌సైట్‌ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్‌ఎస్‌)లోని వివరాలు నమోదు చేసుకోవచ్చునని, అలాగే వచ్చిన అర్జీల వివరాలను టోల్‌ఫ్రీ నంబర్‌ 1100కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలపై ప్రతి సోమవారం వినతులు స్వీకరించనున్నామని పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల వినతులు స్వీకరించడానికి కలెక్టరేట్‌లోని సెల్లార్‌లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌

సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు.

ఒక కట్టకు ఎన్ని కష్టాలో..!

బలిజిపేట: ఒక యూరియా కట్ట కావాలంటే రైతులకు అష్టకష్టాలు తప్పడం లేదు. నానా పడిగాపులు పడినప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. అందుకు తార్కాణంగా బలిజిపేట మండలంలోని పలగర సహకార సంఘం వద్ద రైతులు ఆదివారం రైతులు పడిన పడిగాపులు చూస్తుంటే వారి అవస్థలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. 260యూరియా బస్తాలు వచ్చాయని తెలియడమే తరువాయి రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. ఎక్కడికి యూరియా వచ్చిందన్నా అక్కడికి పరుగులు తీస్తున్నారు. కనీసం ఒక్క బస్తా యూరియా అయినా దొరకదా? అనే ఆశతో బారులు తీరుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా బారులు తీరి యూరియా కోసం పడిగాపులు పడలేదని, నేరుగా ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందేవని, ఇంకా అవసరమైతే ప్రైవేట్‌ డీలర్ల వద్ద సాధారణ రేటుకే కొనుగోలు చేసుకునే వారమని రైతులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఎందుకు ఇంత డిమాండ్‌ వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోతున్నారు.

ఏఓబీలో విస్తృత దాడులు

కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ) గ్రామాలైన వలవ, కెరడ, వనజ, బోరువలస గ్రామాల్లో ఆదివారం సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7,600 లీటర్ల పులిసిన బెల్లపు ఊట, రవాణాకు సిద్ధంగా ఉంచిన 150 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనాథుడు ఆదేశాల మేరకు సారా స్థావరాలపై దాడులు చేపట్టామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు జరిగినా ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు . ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఏఈఎస్‌ సంతోష్‌, కురుపాం ఎకై ్సజ్‌ సిబ్బంది, ఒడిశా ఎకై ్సజ్‌ అధికారులు పాల్గోన్నారు.

పార్వతీపురం టౌన్‌: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ హిత వినాయక విగ్రహాల తయారీపై వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, కెమికల్‌ రంగులతో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించి, మట్టి విగ్రహాల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement