
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
గుంతలను వెంటనే పూడ్చండి
–8లో
జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది
పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్‌గున్యా వంటి జ్వరాల
వ్యాప్తికి కారణమవుతున్నాయి.
మక్కువ/పార్వతీపురం రూరల్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మక్కువ మండలం దుగ్గేరు గ్రామ సమీపంలోని అడారుగెడ్డ ఉద్ధృతిని పరిశీలించి గిరిజనులతో మాట్లాడారు. రాకపోకల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనులకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అనంతరం దుగ్గేరు గ్రామంలో ఎరువుల దుకాణాన్ని పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, నిల్వలపై ఆరా తీశారు. ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ భరత్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ సూర్యనారాయణ, ఏఓ భారతి, తదితరులు ఉన్నారు.
సాకిగెడ్డ పరిశీలన
పార్వతీపురం మండలంలోని లచ్చరాజుపేట– పుట్టూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారికి అనుసరించి ఉన్న సాకిగెడ్డను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. సాకిగెడ్డ ఉప్పొంగడం వల్ల కలుగుతున్న పంటనష్టం, రాకపోకల కష్టాలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సాకిగెడ్డ ప్రవాహంలో కొట్టుకొచ్చిన కోళ్లు, మేకలు లచ్చిరాజుపేట కూడలి సమీపంలో ఉన్న కాజ్‌వే వద్ద చిక్కుకున్నాయి.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
పార్వతీపురం రూరల్: ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదకరమైన గుంతలను పూడ్చేందుకు నివేదిక అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20 నాటికి నివేదిక అందిస్తే తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రమాదకర గుంతలను తాత్కాలికంగా పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో జన ఔషధి కేంద్రాల(జనరిక్) ఏర్పాటుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ సముదాయాలను గుర్తించాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, డీఆర్వో కె.హేమలత, ఎస్‌డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ పీడీలు రామచంద్రరావు, సుధారాణి, కనకదుర్గ, డీపీఓ కొండలరావు, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్, జిల్లా ఉద్యానవనశాఖ వై. క్రాంతికుమార్, ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డా. భాస్కరరావు, సీపీఓ ఆర్.కె.పట్నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పంటలు, ఆస్తి నష్టంపై కలెక్టర్ ఆరా

వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన