శ్యామలాంబకు ప్రత్యేక పూజలు
సాలూరు: సాలూరు పట్టణంలో వెలసిన శ్యామలాంబ అమ్మవారికి వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పండగ నేపథ్యంలో జన్నివీధిలో ఉన్న అమ్మవారి ఘటాలను రాజన్నదొర, సతీమణి రోజమ్మలు దర్శించారు. అమ్మవారి ఘటాలను తలపై పెట్టి మోసారు. అక్కడ నుంచి కాలినడకన శివాజీ సెంటర్‌లోని సిరిమాను చెట్టువద్దకు వెళ్లి పూజలు చేశారు. చివరిగా శ్యామలాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, గొర్లె మాధవరావు, గొర్లె విజయకుమారి, మండల ఈశు, చొక్కాపు రమణమ్మ, గులిపల్లి నాగ, పిరిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


