ఏటా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలకు తిరుపతితో పాటు సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయం నుంచి పట్టువస్త్రాలు తేవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే దేవస్థాన ప్రధాన అర్చకుడు సాయిరామాచార్యులు తిరుపతి నుంచి స్వామి వారి పట్టువస్త్రాలను ఇప్పటికే తీసుకువచ్చారు. సింహాచలం నుంచి పట్టువస్త్రాలు కల్యాణం రోజు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
● సీతారాముల కల్యాణం చూతము రారండి
● రాములోరి పెళ్లికి చురుగ్గా ఏర్పాట్లు
● తిరుపతి నుంచి వచ్చిన పట్టువస్త్రాలు
● ప్రత్యేక ఆకర్షణగా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల సేవ
● ముత్యాల తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు
నెల్లిమర్ల రూరల్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి కల్యాణశోభ సంతరించుకుంది. సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రామస్వామి వారి దేవస్థానం సమీపంలోని స్వామివారి కల్యాణ మండపంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సీతారామస్వామివారి పరిణయం వేడుకగా జరగనుంది. కల్యాణం నిర్వహించే వేదికను సుందరంగా అలంకరిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు రోజుల నుంచే ఆలయానికి కల్యాణ శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది రుత్వికులు స్వామివారి సన్నిధిలో పారాయణాలు, లక్ష తులసీ దళార్చన, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను నిర్విరామంగా జరుపుతున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వామివారి దర్శనం ఇలా...
రూ.50 టికెట్ తీసుకునే భక్తులకు తూర్పు రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం ఉత్తర రాజగోపురం ద్వారా అనుమతిస్తారు. సీతారామచంద్రస్వామి వారి కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు వివిధ రకాల సదుపాయాలను కల్పించారు.
ఎండ తీవ్రత దష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు
ఎండ తీవ్రత దష్ట్యా కల్యాణ ప్రాంగణంలో స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, భక్తులు కూర్చునే వద్ద చల్లగా ఉండేందుకు ఎల క్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చిన్న పిల్లలకు పాలు అందించనున్నారు. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ..
రామతీర్థంలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకల్లో స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను ఉపయోగించనున్నారు. గడిచిన మూడు నెలలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పలువురు భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. భద్రాచలంలో ఏటా జరుగుతున్న శ్రీరాముడి కల్యాణానికి వినియోగించినట్టే రామతీర్థంలో శ్రీరామడి కల్యాణానికి కూడా శ్రీకష్ణ చైతన్య సంఘం వారు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. కల్యాణం అనంతరం తలంబ్రాల సేవను అర్చకులు జరిపించనున్నారు
తిరుపతి నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు..
తిరుపతి నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు..
తిరుపతి నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు..


