● అధికారులను ఆదేశించిన కలెక్టర్
ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లాలో శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన ఉగాది వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని లయ న్స్ కల్యాణ మంటపం వేదికగా ఈ నెల 30వ తేదీన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్ప ష్టం చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, ఆరటిచెట్లతో అలంకరణ ఉండాలన్నారు. వేదిక లోపల, వెలుపల ప్రభుత్వ చిహ్నాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మంగళ వాయిద్యాలు, పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, ఉగాది వచ్చ డి, పులిహోర వంటి ప్రసాదాల ఏర్పాట్లపై దేవదా య శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరా రు. ఆహ్వాన పత్రికల ముద్రణ చేపట్టి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఘనంగా దుశ్శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, డీఆర్‌ఓ కె.హేమలత, డీపీఆర్‌ఓ ఎల్.రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ, సన్మార్గానికి
మారుపేరు రంజాన్
క్రమశిక్షణ, సన్మార్గానికి మారుపేరు రంజాన్ మాసమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. రంజాన్ పండగ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం స్థానిక లయన్స్ కల్యాణ మంటపంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మికంగా మరింత లగ్నమై ఉవటారని, దైవానికి దగ్గర కావడమే కాకుండా దాతృత్వం, కరుణ, సహనం వంటి మంచి లక్షణాలు పెంపొందించుకుంటారని ప్రశంసించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆర్‌ఎస్. జాన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.డి గయాజుద్దీన్, డీపీఓ పి.వీరరాజు తదితరులు పాల్గొన్నారు.


