వరాల వసంతం.. రంజాన్‌ మాసం

- - Sakshi

విజయనగరం టౌన్‌: యావత్తు ప్రపంచంలో ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన, సంతోషాలు పంచే నెల రంజాన్‌. ఈ నెల అరబీ నెలల వరుస క్రమంలో 9వ నెలగా గుర్తించబడుతుంది. రంజాన్‌ అంటే ‘కాలిపోవడం, భస్మీపటలమవ్వడం, ఆగిపోవడం’ అనే అర్ధాలను సూచిస్తుంది. రంజాన్‌ నెలలో ఒక ముస్లిం తన పాపాలు, పొరపాట్లు, తప్పిదాలన్నీ కాలిపోయి వాటికి బదులుగా పుణ్యఫలాలు లభిస్తా యని అర్ధం. ఈ సుఖాల సరోవరం, వరాల వసంతం అయిన రంజాన్‌ మాసం నెలవంకను చూసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ నెల 24 శుక్రవా రం నుంచి ఏప్రిల్‌ 21 వరకూ రంజాన్‌ మాసంగా పేర్కొంటూ ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. ఈ నెలకు అల్లాహ్‌ దృష్టిలో పవిత్రమైన, ప్రత్యేకమైన స్ధానముంది. విశ్వాసులకు ఎనలేని సంతోషాలను, పుణ్యాలను అందిస్తుంది ఈ మాసం. ఏడాది మొ త్తం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకూ ఈ పవిత్ర మాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు.

నెలరోజులు కఠోర దీక్షలు, దానధర్మాలు

పాపాల నుంచి రక్షించుకునే అవకాశం

నేటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం




 

Read also in:
Back to Top