29న రెండోవిడత పల్లెపోరు | - | Sakshi
Sakshi News home page

29న రెండోవిడత పల్లెపోరు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

29న రెండోవిడత పల్లెపోరు

నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రేపటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ జిల్లాలో 150 పంచాయతీలు.. 1,562 వార్డులకు ఎన్నికలు పోలింగ్‌ అనంతరం కౌంటింగ్‌, ఉప సర్పంచ్‌ ఎన్నిక

ఎన్నికల షెడ్యూల్‌ ముఖ్యాంశాలు

సత్తెనపల్లి: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా కలెక్టరేట్‌లో విడుదల చేశారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 173 గ్రామ పంచాయతీలు, 1,712 వార్డు సభ్యులకు ఈనెల 15న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారం(నేడు)తో ముగియనుంది. రెండో విడతలో భాగంగా జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 150 గ్రామ పంచాయతీలకు, 1,562 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పంచాయతీల్లో మొత్తం 3,75,710 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,84,142 మంది, మహిళలు 1,91,549 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరంతా ఓటు హక్కు ద్వారా సర్పంచ్‌లను, వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. సర్పంచ్‌ స్థానానికి సంబంధించి జనరల్‌ కేటగిరీకి రూ. 3 వేలు, ఎస్సీ, ఎస్టీ బీసీలు రూ.1,500, ర్డు సభ్యుడి స్థానానికి: జనరల్‌ కేటగిరికి రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ. 500 నామినేషన్‌ రుసుము చెల్లించాలి.

నామినేషన్ల స్వీకరణ : నవంబరు 18 నుంచి 20 వరకు

పరిశీలన (స్క్రూటినీ) : 21

తిరస్కరణపై అప్పీలు : 22

అప్పీళ్ల పరిష్కారం : 23

నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు: ఈనెల 24 (మధ్యాహ్నం 3 గంటల వరకు)

అభ్యర్థుల తుది జాబితా : 24

గుర్తుల కేటాయింపు : 24

పోలింగ్‌ తేదీ/ఓట్ల లెక్కింపు/

ఉపసర్పంచ్‌ ఎన్నిక : 29

రీపోలింగ్‌ (అవసరమైతే): నవంబరు 30

జిల్లాలో రెండో విడత పంచాయతీల వివరాలు

మండలం పంచాయతీలు వార్డులు పోలింగ్‌ ఓటర్లు

కేంద్రాలు

సత్తెనపల్లి 25 264 264 61,856

ముప్పాళ్ళ 14 146 146 35,781

రాజుపాలెం 18 186 186 42,683

నకరికల్లు 17 188 188 54,301

పెదకూరపాడు 17 166 166 34,813

అమరావతి 05 58 58 14,859

అచ్చంపేట 23 230 230 53,688

క్రోసూరు 18 190 190 50,661

బెల్లంకొండ 13 134 134 27,068

మొత్తం 150 1,562 1,562 3,75,710

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement