ముగిసిన మున్సిపల్‌ నామినేషన్ల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మున్సిపల్‌ నామినేషన్ల ప్రక్రియ

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

చైర్మన్‌కు 21మంది, కౌన్సిలర్ల స్థానానికి 337 మంది దాఖలు

నరసరావుపేట: స్థానిక పురపాలక సంఘం ఎన్నికల కోసం నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన మూడోరోజు సోమవారంతో ముగిసింది. చివరిరోజు పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు చైర్మన్‌, కౌన్సిలర్ల పోస్టులకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. పోలీసులు అధికార టీడీపీ అభ్యర్థులకు దాసోహమన్నారు. నియమ నిబంధనలు గాలికి వదిలేశారు. అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన పర్యవేక్షణలో సిబ్బంది ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నామినేషన్లు స్వీకరించారు. మూడోరోజు చైర్మన్‌ పోస్టుకి 15మంది, కౌన్సిలర్ల పోస్టులకు 171మంది నామినేషన్లు వేశారు. పార్టీల వారీగా చైర్మన్‌ పోస్టుకి వేసిన నామినేషన్లు పరిశీలిస్తే..వైఎస్సార్‌ సీపీ–04, టీడీపీ–03 జనసేన–2, కాంగ్రెస్‌–1, బీఎస్‌పీ–01, ఇండిపెండెంట్లు 10 మంది వేశారు. మొత్తం మూడురోజుల వ్యవధిలో 21మంది అభ్యర్ధులు దాఖలు చేశారు. అలాగే కౌన్సిలర్ల పోస్టులకు వైఎస్సార్‌ సీపీ–88, టీడీపీ–138, జనసేన–33, కాంగ్రెస్‌–08, సీపీఐ–03, బీజేపీ–07, బీఎస్‌పీ–04, ఇండిపెండెంట్లు–52 దాఖలు చేశారు. మొత్తం మూడురోజుల వ్యవధిలో 337 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సమయం ముగిసేలోగా రెండు, మూడు నిముషాల వ్యవధి ఉండగానే పలువురు అభ్యర్థులు పరిగెత్తుకుంటూ వచ్చి నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థి నాగసరపు రూపేష్‌గుప్తా ర్యాలీగా వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ కార్యకర్త కారణంగా కిందపడి దెబ్బతిన్న బీజేపీ అభ్యర్థి రాచకొండ ప్రసాదు వీల్‌చైర్‌పై వచ్చి నామినేషన్‌ వేశారు. అలాగే 17వ వార్డుకు టీడీపీ అభ్యర్థిగా వేసిన పోకా శ్రీనివాసరావుకు మద్దతుగా కాలికి గాయమైన అతని సోదరుడు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ద్విచక్రవాహనంపై నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లి నామినేషన్‌ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement