కోటి పుణ్యాల సోమవారం | - | Sakshi
Sakshi News home page

కోటి పుణ్యాల సోమవారం

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో కోటి సోమవారం సందర్భంగా వేకువజామునుంచే పంచారామక్షేత్ర సందర్శన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కృష్ణాజలాలలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలోని కార్తిక దీపారాధనలు చేసి కార్తిక దామోదరునికి విశేషపూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. 20పైగా బస్సుల్లో పంచారామ క్షేత్రసందర్శన యాత్రికులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ కార్తిక సోమవారం విశిష్టతను గూర్చి వివరిస్తూ కార్తిక సోమవారం శివుడికి అత్యంత ప్రియమైన రోజన్నారు. కోటి సోమవారం భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్టే కోటిరోజుల పుణ్యఫలం లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ సైదమ్మ బాయి తన సిబ్బందితో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్తిక సోమవారం స్వామవారిని సుమారు వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. క్షేత్రంలో ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అమరావతి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కోటప్పకొండలో భక్తుల రద్దీ...

నరసరావుపేట రూరల్‌: కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించిన అనంతరం భక్తులను త్రికోటేశ్వర స్వామి దర్శనానికి అనుమతించారు. వేలాది మంది స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. మహిళలు రావిచెట్టు, మహానందీశ్వరుడు, ఉసిరి చెట్టు, ధ్యానశివడు ప్రాంతాలలో కార్తిక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు సోపాన మార్గంలో మెట్ల పూజ ద్వారా భక్తులు కొండమీదకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలైన్‌లో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ఈఓ డి.చంద్రశేఖర్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అమరేశ్వరునికి కార్తిక సోమవారం పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement