న్యూస్‌రీల్
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 15న నోటిఫికేషన్ .. ఆ వెంటనే మొదటి విడతకు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 2తో ముగినున్న ఎన్నికల ప్రక్రియ జిల్లాలో 512 గ్రామ పంచాయతీలు, 5,286 వార్డులు
జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.2327 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.
సత్తెనపల్లి: పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 2వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లు, గుర్తులు, సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, సౌకర్యాలు, రూట్ మ్యాప్, తదితరవన్నీ పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు జరిగి తుది జాబితా విడుదలైంది. జిల్లాలోని 512 గ్రామ పంచాయతీలు, 5,286 వార్డు సభ్యులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ ప్రక్రియ ఈనెల 15న నోటిఫికేషన్‌తో పాటు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. మూడో విడత డిసెంబర్ 2తో ఎన్నికల ఘట్టం ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
యంత్రాంగం సర్వం సిద్ధం...
జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో 12,36,776 మంది ఓటర్లు ఉంటే వీరిలో పురుషులు 6,08,095, మహిళలు 6,28,583 మంది, ఇతరులు 98 మంది ఉన్నారు. 5,340 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1,698, సున్నిత పోలింగ్ కేంద్రాలు 1,612, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 2,30 ఉన్నాయి. 1,108 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. 512 గ్రామ పంచాయతీలు, 5,286 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 26న, రెండో విడత ఈనెల 29న, మూడోవిడత డిసెంబర్ 2న జరగనుంది.
ఆశావహుల సందడి...
పోటీకి సిద్ధమై తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఆశావహుల సందడి నెలకొంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుండగా కేవలం 17 వరకు మూడురోజులు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు తమ ఏర్పాట్లు ముమ్మరం చేసుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలోని నాయకులు తమ పార్టీల నుంచి మద్దతు కోసం నియోజకవర్గ బాధ్యులను కలుస్తున్నారు. కూటమిలో ఇప్పటికే ఎమ్మెల్యేలను రిజర్వే షన్లు అనుకూలించిన వారంతా కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తమ పట్టు పెంచుకునేందుకు క్యాడర్‌ను సన్నద్ధం చేసి గెలుపు గుర్రాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే పని మొదలుపెట్టింది.
జిల్లాలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
ముఖ్యమైన ఘట్టాలు మొదటి విడత రెండో విడత మూడో విడత
నోటిఫికేషన్ విడుదల నవంబర్ 15 నవంబర్ 18 నవంబర్ 21
నామినేషన్ల స్వీకరణ నవంబర్ 15 నవంబర్ 18 నవంబర్ 21
చివరి తేదీ నవంబర్ 17 నవంబర్ 20 నవంబర్ 23
పరిశీలన నవంబర్ 18 నవంబర్ 21 నవంబర్ 24
అప్పీళ్లకు చివరి తేదీ నవంబర్ 19 నవంబర్ 22 నవంబర్ 25
అప్పీళ్ల పరిష్కరణకు చివరి తేదీ నవంబర్ 20 నవంబర్ 23 నవంబర్ 26
విత్ డ్రాకు చివరి తేదీ నవంబర్ 21 నవంబర్ 24 నవంబర్ 27
పోలింగ్/కౌంటింగ్ నవంబర్ 26 నవంబర్ 29 డిసెంబర్ 02


