జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి
నరసరావుపేట: నంబూరు–ఎర్రుపాలెం నూతన బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. అమరావతి మండలంలోని ఎండ్రాయి, కార్లపూడి, వైకుంఠపురం గ్రామాల్లో రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలు, రైతుల నుంచి ఫారం–5 సమ్మతి పత్రాల స్వీకరణ, ఫారం పూర్తి చేసిన వివరాలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసమీకరణ ప్రక్రియపై కలెక్టరేట్ నుంచి గురువారం సమీక్షించారు. అమరావతి మండలంలోని మూడు గ్రామాల్లో మొత్తం 119.6125 ఎకరాల భూమి రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమవుతోందని, ఇందులో 105.09 ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి ఫారం–5 సమ్మతి పత్రాలు స్వీకరించగా, 4.52 ఎకరాలకు సంబంధించి సమ్మతి ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. అదేవిధంగా, 91.83 ఎకరాలకు సంబంధించి ఫారం–5 ప్రక్రియ పూర్తికాగా, మరో 13.315 ఎకరాలకు సంబంధించి ఫారం–5 పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. మొత్తం 256 మంది రైతులకు సంబంధించి 245 మంది రైతుల నుంచి ఫారం–5 సమ్మతి పొందగా, 210 మంది రైతులకు సంబంధించిన ఫారం–5 ప్రక్రియ పూర్తయిందన్నారు. భూసమీకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, మ్యుటేషన్, వారసత్వ వివాదాలు, ఇతర న్యాయపరమైన అంశాలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
రైల్వే లైన్ నిర్మాణానికి భూముల పరిశీలన..
అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురం, యండ్రాయి, కర్లపూడి గ్రామాలలో రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదినకు అవసరమైన భూములను గురువారం పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనసింహా, రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. మూడు గ్రామాల్లో రైల్వే లైన్‌కు అవసరమైన భూముల సర్వే నంబర్ల అధారంగా అధికారులు పర్యటించారు. భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రైల్వేలైన్ అలైన్మెంట్తో పాటుగా భూముల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ డానియేల్, రెవెన్యూ సిబ్బంది, ఎస్డీసీ అధికారులు, రైల్వే శాఖ సిబ్బంది, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.


