రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామ కూడలి వద్ద గురువారం జరిగింది. ధూళిపాళ్ల గ్రామ కూడలి వద్ద బైక ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. బజాజ్‌ పల్సర్‌ ద్విచక్ర వాహనం నడుపుతున్న రాజుపాలెం మండలం రెడ్డిగూడెం ఆర్‌ఆర్‌ సెంటర్‌కు చెందిన ఫోటోగ్రాఫర్‌ బుర్రి విజయ్‌ తలకు బలమైన గాయమైంది. వెనుక కూర్చున్న బుర్రి రోహిత్‌కు నుదిటిపై రక్తస్రావంతో కూడిన గాయం, తలపై వాపు ఏర్పడింది. టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనం నడుపుతున్న ధూళిపాళ్లకు చెందిన అన్నపురెడ్డి సాంబశివరావుకు నుదుటిపై, తల వెనుక భాగంలో బలమైన గాయాలయ్యాయి. అంతేకాక ఎడమ కాలికి ఎముక రెండు చోట్ల విరిగింది. వెనుక కూర్చున్న ఆచార్యులు భాస్కరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement