ఫిబ్రవరి 9 నుంచి గుణదల మాత ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 9 నుంచి గుణదల మాత ఉత్సవాలు

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

ఫిబ్రవరి 9 నుంచి గుణదల మాత ఉత్సవాలు బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

గుణదల(విజయవాడ తూర్పు): దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రెండవ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథో లిక పీఠం బిషప్‌ తెలగతోటి రాజారావు ప్రకటించారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో గురువారం గుణదల మాత మహోత్సవాల కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు.

శతాబ్ది ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం

కథోలిక క్రైస్తవులు ఎదురు చూస్తున్న శతాబ్ది నూతన ఆయల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని.. ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గుణదల మాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆరేళ్లుగా నిర్మాణంలో ఉన్న నూతన చర్చిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మేరిమాత ఉత్సవాల నవదిన ప్రార్థనల్లో భాగంగా ఫిబ్రవరి 2న వైభవోపేతంగా నూతన ఆలయాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బిషప్‌ లతో పాటు దేశ విదేశాల నుంచి కార్డినల్స్‌, ఆర్చ్‌ బిషప్‌లు, వేలాది మంది కథోలిక క్రైస్తవులు హాజరవుతారని తెలిపారు.

రేడియో ప్రసారాలు ప్రారంభం

మేరీమాత పుణ్యక్షేత్ర ఆవరణలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నూతన ఆలయ ప్రతిష్ఠాపన వంటి విశేషాలను శ్రోతలకు చేర వేసే దిశగా నూతనంగా రేడియో , వెబ్‌ సైట్‌ ప్రసారాలు ఏర్పాటు చేశామని రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు తెలిపారు.

నరసరావుపేట టౌన్‌: పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు గురువారం బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ఐ యువరాజ్‌ పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement