పోలింగ్‌ కేంద్రాలు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలన

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌

వినుకొండ (శావల్యాపురం): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టరు కృతికా శుక్ల అన్నారు. వినుకొండ పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాలను ఆదివారం కలెక్టర్‌ సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లతో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, గంటల తరబడి నిలవాల్సి వస్తోందని జిల్లా కలెక్టరు దృష్టికి తెచ్చారు. వయో వృద్ధులు సైతం క్యూలైన్‌లో లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వివిధ పార్టీల పోలింగ్‌ ఏజంట్లతో మాట్లాడి పోలింగ్‌ సరళీ, ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్‌ తెలుసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వినుకొండ, చిలుకలూరిపేట, సత్తెనపల్లి మున్సిపాలిటీల పరిధిలో 308 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌, వీడియోగ్రఫీ సాంకేతిక పరిజ్ఞానం కల్పించినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ ఏజంట్లు, అభ్యర్థుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎన్నికల సిబ్బంది తదితర అధికారుల పర్యవేక్షణలో పోలింగ్‌ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల అధికారి బి.రమ్య కీర్తీన, కమిషనర్‌ కోడూరి శివరాం ప్రసాదు, తహసీల్దార్‌ సబవత్‌ సురేష్‌నాయక్‌, పట్టణ సీఐ బలగాని ప్రభాకర్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement