వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త సుధీర్‌ భార్గవ్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త సుధీర్‌ భార్గవ్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త సుధీర్‌ భార్గవ్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

సత్తెనపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సరళిని తెలుసు కునేందుకు పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తున్న వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డిని పోలీసులు ఆదివారం అక్రమంగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పలువార్డుల్లో పర్యటిస్తుండగా పట్టణంలోని 8వ వార్డులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వచ్చి కూటమినేతలకు అనుకూలంగా వ్యవహ రిస్తుండడంతో ఆ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి షేక్‌ బాషా ఆయన దృష్టికి తీసుకురావడంతో ఆ వార్డును నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఆ సమయంలో అక్కడ బయట వ్యక్తులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇరువర్గాలకు హెచ్చరికలు చేసి అక్కడి నుంచి బలవంతంగా పంపించారు. అనంతరం సుదీర్‌భార్గవ్‌రెడ్డి పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయానికి చేరుకోగా మీరు నరసరావుపేట వెళ్లాలని, ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో సుదీర్‌ భార్గవ్‌ రెడ్డి నేరుగా జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లికి ఫోన్‌ చేసి తాను పార్టీ కార్యాలయంలోనే ఉంటానని చెప్పటంతో వార్డుల్లో పర్యటించవద్దని హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్టుగా ముగ్గురు పోలీసులను ఆయనకు కాపలా ఉంచారు. ఆయనతోపాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, అచ్యుత శివప్రసాద్‌, చిన్నం మణిబాబు,తల్లం సతీష్‌, మందడపు శివసాయి, వల్లెం నరసింహారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement