మాజీ మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి: రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్ నాయకత్వంలో ప్రజాస్వా మ్యాం ఖూని అయ్యేలా విచ్చలవిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాన్నాయని రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 16వ వార్డు వాల్మీకినగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ తాను గుంటూరులో నివసిస్తున్నానని, తన ఓటు సత్తెనపల్లిలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఓటు వేసేందుకు సత్తెనపల్లి వచ్చానని, తన ఓటు వినియోగించు కున్నానన్నారు. ఎన్నికల సమయంలో మన ప్రాంతంలో చెదురుమదురు సంఘటనలు జరుగుతుంటాయని, కాని కొన్ని ప్రాంతాల్లో కావాలని బీభత్సం చేసి గెలవాలనే ప్రయత్నంలో ప్రజాస్వామ్యం ఖునీ అయ్యేలా చేస్తున్నారన్నారు.ఆయనతో పాటు పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి, మాజీ కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, యాసారపు బాబు, వల్లెం నరసింహారావు తదితరులు ఉన్నారు.


