టీడీపీ హింసాకాండ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ హింసాకాండ

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

గుంటూరు కార్పొరేషన్‌తోపాటు పల్నాడులోని అన్ని మున్సిపాలిటీల్లోనూ అరాచకం తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఐఏపీఎం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ బి. శ్రీధర్‌ గుంటూరు మెడికల్‌: ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పాథాలజిస్ట్స్‌ అండ్‌ మైక్రోబయాలజిస్ట్స్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా గుంటూరు వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, పాథాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.శ్రీధర్‌ ఎన్నికయ్యారు. పీఎస్‌ఐఎంఎస్‌ గన్నవరంలో నిర్వహించిన 8వ ఐఏపీఎం రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కట్టా రమ్య రాష్ట్ర శాఖ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఒకే వైద్య కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి వైద్య సంఘంలో కీలక పదవులకు ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా గుంటూరు వైద్య కళాశాల అధ్యాపకులు, వైద్యులు వారికి అభినందనలు తెలిపారు. పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో వైద్య విద్య, పరిశోధన, శాసీ్త్రయ కార్యక్రమాల అభివృద్ధికి వీరి నాయకత్వం దోహదపడుతుందని ఆకాంక్షించారు. సాఫ్ట్‌బాల్‌ సీనియర్‌ బాలికల ఎంపిక రొంపిచర్ల: రొంపిచర్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్‌ సీనియర్‌ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరికి పోటీలు నిర్వహించారు. పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్‌ సెక్రటరీ పి.సామంత్‌రెడ్డి పర్యవేక్షించారు. పోటీల్లో పాల్గొన్న వారిలో 25 మంది ప్రాబబుల్స్‌ ఎంపిక చేసినట్లు సామంత్‌ రెడ్డి తెలిపారు. వారికి పది రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. వారిలో ప్రతిభ కనబర్చిన వారిని ఉమ్మడి గుంటూరు జిల్లా మెయిన్‌ జట్టుగా ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సైదయ్య, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్‌ రూములకు బ్యాలెట్‌ బాక్సులు తరలింపు జీఎంసీ పరిధిలో బరితెగింపు సత్తెనపల్లిలో దాడులు మాచర్లలో దౌర్జన్యం

మహిళలపై దుశ్శాసన పర్వం

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సరళి ఇలా...

బ్యాలెట్‌ బాక్సుల తరలింపు...

ఖాకీ అండ...
గుంటూరు కార్పొరేషన్‌తోపాటు పల్నాడులోని అన్ని మున్సిపాలిటీల్లోనూ అరాచకం

● యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసిన

పచ్చ మూకలు

● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు

నరసరావుపేట: మురసు తుఫాన్‌ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో మురసు తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం తుఫాన్‌ పరిస్థితిపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్‌్స్‌ ద్వారా సమీక్షించారు. తుఫాన్‌ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మండలాల పరిధిలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

కలెక్టరేట్‌లో తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, వచ్చే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించేందుకు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు 08647–252999 నంబరుతో మూడు షిప్ట్‌ల వారీగా అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

నెహ్రూనగర్‌: జీఎంసీ వార్డుల వారీగా వచ్చిన బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల మెటీరియల్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించి భద్రపరిచారు. పీఓల నుంచి నిర్దేశిత చెక్‌ లిస్ట్‌ ద్వారానే మెటీరియల్‌ తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. మెటీరియల్‌ అందించేందుకు వచ్చిన సుమారు 6 వేల మందికి అందించిన ఆహారాన్ని కమిషనర్‌ వారితో కలిసి భుజించి, ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని సూచించారు. అనంతరం లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన రేపు జరిగే ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

● ఏజెంట్లను బయటకు లాగేసి

రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ గూండాలు

● వైఎస్సార్‌ సీపీ నేతలు,

ఓటర్లను అడ్డుకున్న పోలీసులు

● మహిళలని కూడా చూడకుండా

దాడులకు తెగబడ్డ పచ్చ రౌడీలు

● వైఎస్సార్‌ సీపీ గుంటూరు మేయర్‌

అభ్యర్థి శ్రీదేవి, ఏజెంట్‌పై దాడి

● చిలకలూరిపేట, వినుకొండ,

మాచర్లలోనూ మహిళలను

ఈడ్చిపడేసిన పచ్చ మూకలు

● యథేచ్ఛగా రిగ్గింగ్‌.. వైఎస్సార్‌ సీపీ

అభ్యర్థులను సైతం బూత్‌ వైపు

రానివ్వని పోలీసులు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసులు పోలింగ్‌కు ముందు రోజు శనివారం అర్ధరాత్రి నుంచే అన్ని మున్సిపాలిటీల పరిధిలో వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు, అభ్యర్థుల కుటుంబ సభ్యులను అక్రమంగా నిర్బంధించారు. కనీసం ఓట్లు వేయనీయని దుర్మార్గ పరిస్థితిని సృష్టించారు. వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలందరినీ హౌస్‌ అరెస్టులు చేసి, టీడీపీ గూండాలతో పోలీసులే దగ్గరుండి అరాచక పర్వానికి తెరతీశారు. మహిళలని కూడా చూడకుండా చీరలు లాగి, వారిపై సైతం దాడులకు పచ్చమూకలు తెగబడ్డాయి.

గుంటూరు నగరంలో టీడీపీ గూండాలు పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు తెగబడ్డారు. 57వ డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వెళుతున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నేత భాస్కర్‌రెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 42వ వార్డులో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి తాడిశెట్టి మురళి.. ఏజెంట్‌ను బెదిరించి బయటకు పంపాక రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 59వ వార్డులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వెంకటేశ్వర్లు నాయక్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్‌ పాఠశాల వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన 40 మందిని వైఎస్సార్‌ సీపీ నేతలు వెనక్కి పంపించారు. టీడీపీ నేత భీమనాథం భరత్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రాల వద్ద కారులో హల్‌చల్‌ చేస్తుండగా ఫొటో తీశారనే నెపంతో ‘సాక్షి’ రిపోర్టర్‌పై దాడికి యత్నించి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు.

సత్తెనపల్లి టౌన్‌ సీఐ ప్రభాకర్‌, రాజుపాలెం ఎస్‌ఐ మణికృష్ణలు టీడీపీ నేతలకు ఊడిగం చేశారు. టీడీపీ నేతలను మెప్పించేందుకు అర్ధరాత్రి 12వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి పెద్దింటి గోవిందమ్మ భర్త వెంకటేశ్వర్లును ప్రివెంటివ్‌ అరెస్టు పేరుతో అక్రమంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కనీసం ఓటు వేసేందుకు కూడా అనుమతించలేదు. మరోవైపు టీడీపీ గూండాలు గోవిందమ్మ కుమారుడు బీప్‌ చంద్‌ను ముసుగులో వచ్చి కిడ్నాప్‌ చేసినా పోలీసులు చోద్యం చూశారు. వైఎస్సార్‌ సీపీ నేత గార్లపాటి ప్రభాకర్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి గాయపరచడంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. 15వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవాల్సిన టౌన్‌ సీఐ వారిని పోలింగ్‌ బూత్‌లోకి తానే పంపారు. అక్కడ ఉన్న వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌ భార్గవ్‌రెడ్డిని మాత్రం హౌస్‌ అరెస్టు చేసి నిర్బంధించారు. ముప్పాళ్ల, సత్తెనపల్లి రూరల్‌ మండలాల్లో టీడీపీ గూండాలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పలు వార్డుల్లో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని అరికట్టాల్సిన పోలీసులు దగ్గరుండి వారికి సహకరించారు.

శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌ సీపీ నేతలు, అభ్యర్థుల కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కనీసం ఓటు వేసేందుకు కూడా అనుమతించలేదు. పట్టణంలో 300 మంది పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ, టీడీపీ నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేశారు. బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌లకు పాల్పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. అడ్డుకోబోయిన వైఎస్సార్‌ సీపీ నేతలను, ఓట్లు వేసేందుకు వెళుతున్న ఓటర్లను పోలీసులు వెనక్కి పంపించారు. ఓటర్ల నుంచి స్లిప్పులను లాక్కుని టీడీపీ ఏజెంట్లే ఓట్లు వేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. 36వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామ తులశమ్మ, 6వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి అంజలిలను సైతం వారి ఓటు వారు వేసుకునేందుకు టీడీపీ నేతలు అనుమతించని పరిస్థితి నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. 23వ వార్డు పోలింగ్‌ బూత్‌లో జనసేన అభ్యర్థి అనుచరులు సీసీ కెమెరాలను పగులగొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయం పక్కాగా బయటపడటంతో ఆర్వో ఫిర్యాదు మేరకు 23వ వార్డులోని రెండు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ కృతికా శుక్లా ఎస్‌ఈసీకి సిఫార్సు చేశారు.

సత్తెనపల్లి: జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ఆదివారం పుర పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 69.81 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల పురపాలక సంఘాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. లైన్‌లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. నాలుగు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలతోపాటు 156 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకుగాను చిలకలూరిపేటలో 16, సత్తెనపల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 140 వార్డులకు 308 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ నిర్వహించారు. సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ పాఠశాల ఎదుట వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై కూటమి నేతల అనుచరులు విచక్షణరహితంగా దాడులకు తెగబడ్డారు. వీధిరౌడీల్లా నడిరోడ్డుపై చెక్కరాడ్లతో దాడులు, రాళ్లు రువ్వారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చెదరకొట్టారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ నాగుర్‌మీరాన్‌ కుమారుడు మహ్మమద్‌ ఇబ్రహీంకు వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. వినుకొండలో 8వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి పోలూరి అర్చనామూర్తిపై కూటమి అభ్యర్థి పోలూరి అంజలిదేవి కుమారుడు పీవీ సురేష్‌ బాబు దాడి చేసినా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. 8వ వార్డుల్లో ఏకపక్షంగా రిగ్గింగ్‌లు చేశారు. మాచర్ల 23వ వార్డులో సీసీ కెమెరాలను కూటమి గూండాలు పగలగొట్టారు.10వ వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై పచ్చ మూకలు దాడులకు తెగబడ్డాయి. ముగ్గురు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. చిలకలూరి పేటలో దాడులు, మధ్యాహ్నం నుంచి బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌లకు పచ్చమూకలు తెగబడ్డాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా, పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. సత్తెనపల్లిలోని 15వ వార్డులో 20కిపైగా, 17వ వార్డులో పోలింగ్‌ బూత్‌లో సుమారు 60కిపైగా దొంగ ఓట్లను పచ్చమూకలు వేశాయి. మరికొన్ని వేసేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌ సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీఎస్పీ డాక్టర్‌ ఎంవీ కృష్ణ చైతన్య, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, పోలీసులు హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉఽద్రిక్తత చోటుచేసుకుంది. వైఎఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ నేతలు పెద్దింటి వెంకటేశ్వర్లు(చిట్టి), శంకర్‌, షేక్‌ జానీ ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని పలు వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ, కూటమికి చెందిన అభ్యర్థుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 2,28,456 మంది ఓటర్లు ఉండగా 1,59,475 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉద్రిక్తత .. లాఠీచార్జ్‌ ...

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చిలకలూరిపేట, వినుకొండ,సత్తెనపల్లి, మాచర్లలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధుల పై కూటమి నాయకులు దాడులకు యత్నించటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలై ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి చెదర గొట్టారు. పోలీసులు ఇరు వర్గాలకు నచచెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా పోలింగ్‌ ప్రారంభమైన అనంత రం కూటమినేతల అనుచరులు అల్లరి సృష్టించే ప్రయత్నాలు చేయగా పోలీసులు హెచ్చ రికలు చేశారు.మాచర్లలో పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్ల, సత్తెనపల్లిలో పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి సందర్శించారు.అడిషనల్‌ ఎస్పి మాల్యాద్రి సత్తెనపల్లిలో బందోబస్తు పర్యవేక్షణ చేశారు.

జిల్లాలో పోలింగ్‌ శాతం ఇలా...

ఉదయం 9 గంటలకు 11.77, 11 గంటలకు 31.11, మధ్యాహ్నం ఒంటి గంటకు 47.84, మధ్యాహ్నం 3 గంటలకు 61.02, సాయంత్రం 5 గంటలకు 69.81గా పోలింగ్‌ శాతం నమోదైంది.

చిలకలూరిపేటలో ఓటు హక్కు

వినియోగించుకున్న మాజీ మంత్రి విడదల రజిని

సత్తెనపల్లిలో 2 వార్డుకు చెందిన వీరమ్మను ఓటు వేయడానికి మంచంపై తీసుకెళుతున్న దృశ్యం

ఓటమి భయంతో టీడీపీ నేతలు తమ గూండాలను రెచ్చగొట్టారు. మహిళలపై సైతం దాడులకు తెగబడిన దుర్మార్గపు ఘటనలు ఆదివారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. గుంటూరు నగరంలోని 57వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నవారిని అడ్డుకున్నారనే కారణంతో ఏజెంట్‌ విజయారెడ్డి చీర లాగి దాడి చేశారు. బ్యాలెట్‌ బాక్సును దూరంగా విసిరివేసి బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి శ్రీదేవిపై సైతం దాడికి తెగబడ్డారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ నేతలు ప్రవర్తించారని మహిళలు మండిపడుతున్నారు.

వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థిని పోలూరి అర్చనామూర్తిపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రధాన అనుచరుడు పి.వి.సురేష్‌బాబు పోలింగ్‌ స్టేషన్‌ ఆవరణలో పోలీసుల ఎదుటే దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అయినప్పటికీ పోలీసులు చోద్యం చూశారు. ఆమె భర్త నరసింహమూర్తిపై సైతం దాడికి పచ్చ గూండాలు తెగబడ్డారు.

చిలకలూరిపేట మున్సిపల్‌ పరిధిలోని 20వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి అన్నపురెడ్డి శ్రీలక్ష్మిపై టీడీపీ గూండాలు దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ఆమెను బూత్‌ల వద్దకు రానీయకుండా దాడి చేయడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాకుండా 13వ వార్డులో ఓట్లు వేసేందుకు వచ్చిన మహిళలపై టీడీపీ గూండాలు దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రాల ఎదుట వారు ధర్నాకు దిగారు.

జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్స్‌లను ఆయా పట్టణాల్లోని స్ట్రాంగ్‌ రూములకు తరలించారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లను పోలీసు బందోబస్తు మధ్య ఆయా మున్సిపాలిటీల ఆర్వోల నేతృత్వంలో స్ట్రాంగ్‌ రూములకు తరలించి సీలు వేయించారు. ఈ నెల 3న స్ట్రాంగ్‌ రూమ్‌ల సమీపంలోనే ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement