సుప్రీం ఆదేశాలు సక్రమంగా అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశాలు సక్రమంగా అమలు చేయండి

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

సుప్రీం ఆదేశాలు సక్రమంగా అమలు చేయండి

గుంటూరు ఎడ్యుకేషన్‌: స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజీని భద్రపరచాలని సుప్రీంకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలను జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం సక్రమంగా అమలు చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు(జోన్‌–3) పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం అరండల్‌పేటలోని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ కార్యాలయంలో పోలూరి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కింది స్థాయి అధికారులు, పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను తూ.చా. తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కా రం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశా రు. మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసే వరకు ప్రతి పోలింగ్‌ బూత్‌లో సీసీటీవీ, వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా నామినేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉన్న ప్రాంతాల్లో రిటర్నింగ్‌ అధికారులు సీసీ ఫుటేజ్‌, వీడియోగ్రఫీని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వాటిని భద్రపరచాలని సూచించారు. ప్రతి ఎన్నికల అధికారి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించి, ప్రతి ఓటరుకు, పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి ఆయా ఫుటేజ్‌ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలతో పాటు ఎన్నికల అనంతరం స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ ఫుటేజ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపుతో పాటు స్ట్రాంగ్‌ రూమ్‌ ఓపెన్‌ చేసే సమయంలో సీసీ ఫుటేజ్‌, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని కోరారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల పిటిషన్లు ఫైల్‌ చేయటం కోసం ఇచ్చిన గడువు ముగిసే వరకు ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీ ద్వారా భద్రపరిచి ఉంచాలన్నారు. ఎక్కడైనా కేసు దాఖలైతే కోర్టులో కేసు తేలే వరకు సీసీ ఫుటేజీ భద్రపరచాలన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు సంబంధిత వీడియో ఫుటేజీని అందించాల్సి ఉన్న వాస్తవాన్ని గుర్తెరగాలని ఆయన సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి అధికారులంతా ప్రజాసామాన్ని కాపాడాలని కోరా రు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుని, అభ్యర్థులు నిరాటంకంగా నామినేషన్లు వేసేందుకు వీలుగా తగిన పోలీసు బందోబస్తు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement