చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా

ముప్పాళ్ళ:ఎన్నికల సిబ్బంది చిత్తశుద్ధితో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా చెప్పారు. ముప్పాళ్ళలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించే పీఓ, ఏపీఓ, ఓపీఓలకు రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని శనివారం తనిఖీ చేశారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓ లు ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రంలో ఏమైనా గొడవలు జరిగే సిబ్బంది కూల్‌గా ఉండాలన్నారు. విధులు నిర్వహించే సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారని చెప్పారు. అవసరమైతే సంబంధిత అధికారికి ఫోన్‌ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ కె.నగేష్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో కేవీ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది పనిచేయాలన్నారు. ఐదుగంటలకు క్యూలో ఉన్న వారందరికీ స్లిప్పులు ఇచ్చి ఓటు వేసేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్‌స్టేషన్‌లో సిబ్బంది నియామకం, అక్కడ నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించారు. సెన్సిటివ్‌ మండలం నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శిక్షణకు మాస్టర్‌ ట్రైనర్‌లుగా సీహెచ్‌.మోహన్‌రెడ్డి, ఎం.సురేష్‌ వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement