పెదకాకాని: టీడీపీ నుండి మాజీ వార్డు సభ్యుడు మంజుల రామకృష్ణతో సహా 30 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గోళ్ళ జ్యోతి వారికి పార్టీ కండువాలు వేసి స్వాగతించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర కృష్ణారెడ్డి, గోళ్ల శ్యాంముఖర్జీబాబు, ఆలపాటి రాఘవ, తాడిబోయిన వేణు, యడ్లపల్లి రమేష్, గోళ్ళ జోసెఫ్, దానబోయిన సాంబయ్య, ఆరుదల గడ్డేశ్వరరావు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) ఆధ్వర్యంలో దూరవిద్య టెన్త్, ఇంటర్‌లో ప్రవేశానికి ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదువు మధ్యలో నిలిపివేసిన, వివిధ కారణాలతో పాఠశాల విద్యను కొనసాగించలేకపోయిన అభ్యర్థులతో పాటు గతంలో టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాలేకపోయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు సమీపంలోని ఏపీఓఎస్‌ఎస్ గుర్తింపు పొందిన స్టడీ సెంటర్ ద్వారా నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయాలని తెలిపారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో సోమవారం కుంచనపల్లిలోని గీతాంజలి సీబీఎస్‌ఈ పాఠశాలలో అండర్ 14, అండర్ 17 బాల, బాలికల ఆర్చరీ జిల్లా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీహెచ్ వినయ్‌కుమార్ శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు బీఆర్ స్టేడియంలో జరగనున్న స్కేటింగ్ అండర్ 14, 17, 19 జిల్లా ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9.00 గంటలకు చేరుకోవాలని సూచించారు.


