సచివాలయ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

దాడి చేసి పింఛను నగదు రూ. 1.30 లక్షలను లాక్కెళ్లిన దుండగులు

బెల్లంకొండ:సచివాలయ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వద్ద ఉన్న పింఛను నగదు లాక్కెళ్లిన ఘటన మండలంలోని మన్నె సుల్తాన్‌పాలెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు పెదలంక భాను కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మన్నెసుల్తాన్‌ పాలెం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. కాగా శుక్రవారం శివారు గ్రామమైన రామాంజనేయపురంలో పింఛన్లు పంపిణీ చేసి, మధ్యాహ్న సమయానికి సచివాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన పలువురికి పింఛన్‌ ఇస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి సచివాలయంలో ఉన్న తనపై దాడి చేసినట్లు తెలిపారు. తన వద్ద ఉన్న పెన్షన్‌ నగదు రూ. 1లక్ష 30వేలను లాక్కెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో సచివాలయానికి వచ్చిన స్థానికులు వారిని వీడియోలు తీస్తుండగా అక్కడ నుంచి పరారైనట్లు తెలిపాడు. బాధితుడిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement