ప్రహరీ కూలి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రహరీ కూలి బాలుడు మృతి

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

ప్రహరీ కూలి బాలుడు మృతి లైంగిక దాడి నిందితుడిపై కేసు

తెనాలి టౌన్‌: తుఫాన్‌ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రహరీ కూలి బాలుడు మృతి చెందిన సంఘటన రూరల్‌ మండలం గుడివాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కృష్ణుడి గుడి పక్క బజార్‌లో చింతలపూడి నాగభూషణం, రేవతి దంపతులు ఇసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చింతలపూడి దేవాన్ష్‌ (11) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న తాత ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో బాలుడి కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా ఎదురింటి ప్రహరీ కూలి ఉండటాన్ని గుర్తించారు. ఆ శిథిలాల కింద చూస్తే సాయంత్రం బాలుడి మృతదేహం లభ్యమయింది. దీంతో కుటుంబ సభ్యుల వేదనకు అంతులేకుండా పోయింది. ఘటన స్థలాన్ని తహసీల్దార్‌ కె.వి.గోపాలకృష్ణ, రూరల్‌ ఎస్‌ఐ కె.ఆనంద్‌, గ్రామ ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి గోడ కూలి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): మైనర్‌ను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లచెరువులో నివాసం ఉండే 16 ఏళ్ల బాలికకు పల్నాడు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన ఏసుబాబు అనే యువకుడు పరిచయమయ్యాడు. మైనర్‌కు మాయమాటలు చెప్పి వారం రోజుల క్రితం నల్లచెరువు నుంచి మాచవరం తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement