నరసరావుపేట: నియోజకవర్గంలోని నామినేషన్ కేంద్రాలను తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితో ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీకి బలం ఉన్న గ్రామాలకు నామినేషన్ కేంద్రాలను మార్చటంపై బుధవారం కలెక్టరేట్లో డీఆర్ఓకు వివరాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొంపిచర్ల మండలంలో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే వీటిని మారుస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే 2021 పంచాయతీ ఎన్నికల నాటి నామినేషన్ కేంద్రాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో రొంపిచర్ల మండల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో డీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లిన డాక్టర్ గోపిరెడ్డి


