కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం విజిలెన్స్ కార్నివల్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బందికి పాటల పోటీలు, వివిధ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీజీబీ చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల మానసిక, శారీరక, దృఢత్వం మెరుగుపడటంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతోపాటు దేశాభివృద్ధికి నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. విజిలెన్స్ ఇన్‌చార్జి హరీష్ బేతా మాట్లాడుతూ ఉద్యోగులు విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు ఎ.రాజశేఖరం, పి.శ్రీదేవి, బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.


