ఉమ్మడి జిల్లా స్కూల్‌గేమ్స్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా స్కూల్‌గేమ్స్‌ జట్ల ఎంపిక

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

చిలకలూరిపేట: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్‌, నెట్‌బాల్‌, కరాటే, కల్వరిపట్టు, కురుష్‌ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం ఆదివారం ఏఎంజీ హైస్కూల్‌లో నిర్వహించారు. అండర్‌ –19 విభాగంలో నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, కరాటే, కల్వరిపట్టు, కురుష్‌ జిల్లా జట్ల ఎంపిక చేశారు. అండర్‌ –17 కల్వరిపట్టు, అండర్‌–14, అండర్‌ –17లలో కురుష్‌ జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపిక బాలబాలికల జట్లను విడివిడిగా నిర్వహించారు. ఈ ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో ఆయా విభాగాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాయని ఫెడరేషన్‌ సభ్యులు తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మొత్తం 320 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఎంపిక కార్యక్రమం గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి వినయ్‌కుమార్‌, పల్నాడు జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పిచ్చయ్య, ఎడ్మిన్‌ కార్యదర్శి రషీదా పర్యవేక్షణలో నిర్వహించారు. జిల్లా జట్లకు ఎంపికై న విద్యార్ధులను ఏఎంజీ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ మహంతి, స్కూల్‌ హెచ్‌ఎం కృపాదానం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement