రైలు నుంచి పడి ప్రయాణికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి ప్రయాణికుడు మృతి

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

రైలు నుంచి పడి ప్రయాణికుడు మృతి సూపర్‌వైజర్‌ అనుమానాస్పద మృతి

తెనాలిరూరల్‌: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందిన ఘటన విజయవాడ–చైన్నె రైలు మార్గంలో శనివారం రాత్రి జరిగింది. సుమారు 30 నుండి 35 ఏళ్ల వయసున్న పొన్నూరు సమీపంలో రైలు నుంచి జారి పడి అక్కికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్‌.సరస్వతి ఆదివారం తెలిపారు.

తాడికొండ: తుళ్లూరు మండలం రాజధాని ప్రాంతమైన మందడం గ్రామంలో నైట్‌ డ్యూటీ సూపర్‌వైజర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. మదండం గ్రామ పరిధిలోని ఈ 8 రోడ్డు నిర్మాణ పనుల్లో నైట్‌ డ్యూటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్‌(42) శనివారం అర్ధరాత్రి ముక్కు వెంబడి రక్తం కారుతూ అనుమానాస్పదంగా అపస్మారక స్థితిలో కనిపించాడు. గమనించిన టిప్పర్‌ డ్రైవర్‌ వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement