నరసరావుపేట టౌన్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రాజమోహన్‌రావు గురువారం తెలిపారు. నరసరావుపేట రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలోని నుదురుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు పట్టాల పక్కన మృతి చెంది ఉన్నాడు. స్టేషన్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్, నీలం రంగు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.


