అచ్చంపేటలో తెల్లవారుజామున అరెస్టులు | - | Sakshi
Sakshi News home page

అచ్చంపేటలో తెల్లవారుజామున అరెస్టులు

Oct 23 2026 2:09 AM | Updated on Oct 23 2026 2:09 AM

అచ్చంపేట: వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ చిల్కా చంద్రయ్య, సీనియర్‌ నాయకులు, పెదపాలెం మాజీ సర్పంచ్‌ నెల్లూరి చంద్రబాబు, మండల మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ షేక్‌ బీరువాల జానీలను అదుపులోకి తీసుకుని బెల్లంకొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎందుకు తీసుకెళుతున్నారని అడిగినా శాంతిభద్రతల పరిరక్షణ అంటూ పోలీసులు బలవంతంగా పోలీస్‌ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఎంత ప్రాథేయపడ్డా వినిపించుకోలేదు.

ఎస్‌ఐ బీవీ కృష్ణారావు అత్యుత్సాహం

నూజెండ్ల: ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియలో ఎస్‌ఐ బీవీ కృష్ణారావు అత్యుత్సాహం చూపారు. కూటమి నేతల అండదండలతో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నామినేషను వేయించే ప్రసక్తే లేదు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో హెచ్చరించారు. కూటమి నేతలు, పోలీసులు కుమ్మకై కేవలం వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవటం జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు ప్రశ్నించగా వాగ్వావాదం చోటుచేసు కొంది. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సై బీవీ కృష్ణారావు ఇరుపార్టీల వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం వైఎస్సార్‌ సీపీ నేతలపై లాఠీచార్జి చేశారు.

నామినేషన్లకేంద్రంలో ఆంక్షలు

ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియ న్యూస్‌ కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపిన సంఘటన నూజెండ్లలో గురువారం చోటుచేసుకుంది. వి వరాల మేరకు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేసేందుకు ఆర్వో వద్దకు వస్తున్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడి యా ప్రతినిధులు కవరేజ్‌ చేసుకునేందుకు ఆర్వో అనుమతులు ఇచ్చినా పోలీసులు మా త్రం ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ఎస్సై బీవీ కృష్ణారావు తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్‌ కేంద్రం ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైఎస్సార్‌ సీపీ నాయకుడి టీస్టాల్‌ ధ్వంసం

మాచర్ల కారంపూడిలో ఉన్న వైఎస్సార్‌ సీపీ నాయకుడు గొట్టిముక్కల వెంకటరెడ్డికి చెందిన టీ స్టాల్‌లోకి గురువారం టీడీపీ గూండాలు చొరబడి కర్రలతో దాడి చేశారు. టేబుళ్లను, టీ స్టాల్‌ను ధ్వంసం చేశారు. చినగార్లపాడు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనేక సంవత్సరాలుగా కారంపూడిలో టీ స్టాల్‌ నడుపుతున్నాడు. రాజకీయ కక్ష పెట్టుకొని టీడీపీ దుండగులు కర్రలతో దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. అతనిని అవమానకరంగా దూషించి దాడి చేసి గాయపరిచారు. వైస్సార్‌సీపీ అంటే చంపుతామని బెదిరించి ధ్వంసం చేసి వెళ్లిపోయారు.

పెండ్లి ఖర్చుల కోసం

ప్రేమ జంట చైయిన్‌ స్నాచింగ్‌

వెల్దుర్తి: మండలంలోని వెల్దుర్తికి చెందిన ఓ ప్రేమ జంట పెండ్లి ఖర్చుల కోసం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలి మెడలో 30 గ్రాముల బంగారు పుస్తెలతాడు చోరీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసులు విచారణలో వెల్దుర్తి గ్రామానికి చెందిన రమణారెడ్డి, వరలక్ష్మిలు ప్రేమ వివాహం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని గుర్రంగూడలో సహజీవనం చేస్తున్నారు. వీరు ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెండ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవటంతో అక్టోబర్‌ 18న హస్తినాపురంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తున్న అందుగుల రాములమ్మ మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లారు. సీసీ పుటేజి పరిశీలించిన వనస్థలిపురం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బంగారు పుస్తెలతాడుతోపాటు రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌ విధించారు.

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

మేడికొండూరు: మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలోని పాలడుగు అడ్డరోడ్డు బస్‌ షెల్టర్‌ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాదాల గ్రామానికి చెందిన చిట్టి మల్లేశ్వరి(28) మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామాల్లో వెంట్రుకలు విక్రయ వ్యాపారం నిర్వహించే మల్లేశ్వరి, స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌షెల్టర్‌ వద్ద వేచి ఉంది. ఈ సమయంలో భీమినేని వారిపాలెం నుంచి సిరిపురం వైపు వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బస్‌షెల్టర్‌ వైపు దూసుకొచ్చి ఆమె ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. సిరిపురం గ్రామానికి చెందిన దొప్పలపూడి సచిన్‌ ట్రాక్టర్‌ నడుపుతున్నట్లు గుర్తించారు. మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ ట్రాక్టర్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement