రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

గురజాల నియోజకవర్గంలో బలవంతపు ఏకగ్రీవాలు ఎమ్మెల్యే యరపతినేని రాజకీయ ఆత్మహత్యకు పునాది విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేసిందని, వారి కుట్రలు, కుతంత్రాలకు వెరసి తమకు దక్కిన ఈరోజు ఓటమే రేపటి తమ గెలుపునకు నాంది అని గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురజాల సంఘటన చూస్తుంటే ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఏమాత్రం లేదని తేటతెల్లమైందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే తలంపు లేనప్పుడు వారే పంచాయతీరాజ్‌ చట్టాన్ని మార్చుకొని తమ పార్టీ వారే గెలిచినట్లుగా ప్రకటించుకుంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటూ పక్షపాతంగా వ్యవరించారన్నారు. ఎన్నికలు ప్రకటించి పోలీసుల చేత ప్రతిపక్షపార్టీకి చెందిన అభ్యర్థులను అరెస్టు చేయించటమనేది గురజాలలో తప్పితే దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. బలవంతాన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అరెస్టు చేయించి అక్రమ పద్ధతిలో ఏకగ్రీవాలు చేసుకున్న స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన రాజకీయ ఆత్మహత్యకు బీజం వేసుకున్నాడని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ తరఫున నామినేషన్‌ వేయాల్సిన గురజాల అభ్యర్ధిని ఒకరోజు ముందు ప్రివెంటివ్‌ అరెస్టు అంటూ అక్రమ నిర్భంధంలోకి తీసుకున్నారన్నారు. అభ్యర్ధిని అరెస్టు చేస్తే నామినేషన్‌ ఏవిధంగా వేస్తాడని ప్రశ్నించారు. పథకాలు ఇవ్వలేదనే భయం, జనం తిరగబడతారనే భయంతో ప్రతిపక్షాన్ని అణచివేస్తూ దాడులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. దీనికి వత్తాసుగా పోలీసులు హౌస్‌ అరెస్టులు, దొంగకేసులు పెట్టి నూతన వరవడికి గురజాలలో బీజం వేశారన్నారు.

● దాచేపల్లి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని అక్రమ అరెస్టుచేస్తే కోర్టు ఆదేశాల మేరకు ఆయన డిపాజిట్‌ చెల్లించి, నామినేషన్‌ వేశారన్నారు. అయినా డిపాజిట్‌ చెల్లించలేదంటూ నామినేషన్‌ తిరస్కరించారని ఆ నామినేషన్‌ పత్రాన్ని విలేకర్లకు చూపించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షపార్టీ అభ్యర్ధులను గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. జరగబోయే అన్ని ఎన్నికల్లో యధావిధిగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని స్పష్టం చేశారు. మాచర్ల పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement