వైభవంగా చండీ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా చండీ కల్యాణం

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

అమరేశ్వరాలయంలో

జరుగుతున్న చండీ కల్యాణం

చండీసమేత అమరేశ్వరస్వామి

కల్యాణ మూర్తులు

అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి చండీ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారిని, స్వామివారిని ఆలయంలోని కల్యాణ మండపంలో ఉంచి స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో ఆలయ అర్చకులు విఘ్నేశ్వరపూజ, రక్షాబంధనం, పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆయన చండీకల్యాణ విశిష్టత గురించి భక్తులకు వివరిస్తూ స్వామివారికి సంవత్సరానికి రెండుసార్లు అనగా మహాశివరాత్రి దసరా శరన్నవరాత్ర మహోత్సవాలకు కల్యాణం నిర్వహించటం విశేషమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement